NTR -Balakrishna: ఎన్టీఆర్ బాలయ్య మధ్య గొడవకు అసలు కారణం ఇదేనా…. అందుకే దూరం పెట్టాడా?

NTR -Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలోను అలాగే రాజకీయాలలో కూడా నందమూరి కుటుంబానికి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఇక నందమూరి కుటుంబం నుంచి బాలకృష్ణ హీరోగా మంచి సక్సెస్ అందుకోగా తర్వాత తరంలో ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ వంటి వారు హీరోలుగా కొనసాగుతూ మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఇక ఇండస్ట్రీలో ఎన్టీఆర్ స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నారు.

ఇక నందమూరి వారసులైనటువంటి ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఇద్దరినీ కూడా నందమూరి కుటుంబం పూర్తిగా దూరం పెట్టిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా బాలకృష్ణ ఇద్దరితో కనీసం మాట కూడా మాట్లాడలేదని స్పష్టమవుతుంది. ఎమ్మెల్యేగా బాలకృష్ణ మూడోసారి గెలిచిన తర్వాత ఈ ఇద్దరు అబ్బాయిలు సోషల్ మీడియా వేదికగా తన బాబాయ్ కి శుభాకాంక్షలు చెప్పారు అలాగే ఇటీవల పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు కూడా శుభాకాంక్షలు చెప్పారు కానీ బాలకృష్ణ ఎలాంటి రిప్లై ఇవ్వలేదు.

ఇక ఎన్టీఆర్ వర్ధంతి జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన తీసేయమంటూ బాలకృష్ణ ఆర్డర్లు వేయటం కూడా జరిగింది. ఇలా ప్రతి విషయంలోనూ బాలకృష్ణ ఎన్టీఆర్ ను దూరం పెడుతూ రావడంతో అసలు వీరిద్దరి మధ్య గొడవకు కారణం ఏంటి అనే సందేహం ప్రతి ఒక్కరిలో కలిగింది. అయితే ఇలా బాలకృష్ణ ఎన్టీఆర్ ను దూరం పెట్టడానికి కారణం లేకపోలేదని తెలుస్తుంది.

వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిండు సభలో తన మేనత్త నారా భువనేశ్వరుని వల్లభనేని వంశీ కొడాలి నాని వంటి వారు ఎంతో అవమానకరంగా మాట్లాడారు. ఇక వంశీ నాని ఇద్దరు కూడా ఎన్టీఆర్ కు ప్రాణ స్నేహితులు. అయితే ఈ విషయంపై ఎన్టీఆర్ ఏదో స్పందించాలి అంటే స్పందించారే తప్ప గట్టిగా మాట్లాడలేదు. అలాగే ఎన్టీఆర్ మెడికల్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరుని పెట్టినప్పుడు కూడా ఈయన పెద్దగా స్పందించలేదు.

ఇకపోతే స్కిల్ డెవలప్ స్కామ్ లో భాగంగా చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో ఎంతోమంది నందమూరి కుటుంబ సభ్యులు అలాగే అభిమానులు సినిమా సెలబ్రిటీలు కూడా స్పందించారు కానీ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ మాత్రం ఎక్కడా స్పందించలేదు. ఇలా ఎన్టీఆర్ స్పందించకపోవడంతో ఐ డోంట్ కేర్ అంటూ బాలయ్య మీడియా సమావేశంలో కూడా తెలియజేశారు. ఇలా ప్రతి సందర్భంలోనూ ఎన్టీఆర్ ఏ విధమైనటువంటి స్పందన తెలియజేయకపోవడంతోనే బాలకృష్ణ కూడా తనని పూర్తిగా దూరం పెట్టారని తెలుస్తుంది.