జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఓ దేశపు జాతీయ జెండాకు ఉన్నంత పొగరుందని చాలా పబ్లిక్ సమావేశాల్లో కాలరెగరేసి మరీ స్పీచ్ లిచ్చాడు. తాను బలంగా సంకల్పిస్తే సాధించలేనిది అంటూ ఏదీ ఉండదని గట్టిగానే చెప్పాడు. తన అన్నయ్య చిరంజీవి మాటను సైతం కాదని రాజకీయాల్లోకి వచ్చాడంటే అతను కచ్చితంగా తనపై తనకు రాజకీయాల్లో రాణిస్తాడనే నమ్మకంతోనే. ఇవన్నీ పవన్ జనసేన పార్టీ పెట్టిన ఆరంభ సమయంలో చెప్పిన మాటలు. ఇప్పుడాయన గురువు, టీడీపీ అధనేత చంద్రబాబు నాయుడుతో కలిసి వాస్తవ రాజకీయాలు ఎలా చేయాలో ట్రెయినింగ్ తీసుకుంటున్నాడు. గత ఎన్నికల ఘోర పరాభవం పవన్ కు ఓ గుణపాఠం. ఓ అనుభవం.
రాజకీయాలు నిస్వార్ధంగా చేస్తే పనవ్వదు. రాజకీయాలు రాజీకీయాలుగానే చేయాలని చాలా ఆలస్యంగా గ్రహించాడని ఇప్పుడు అధికర పక్షంపై ఆయన గారు చేస్తోన్న విమర్శలను బట్టి ప్రజలకు, అభిమానులకు కూడా ఓ క్లారిటీ వచ్చింది. పవన్ ఇప్పుడిప్పుడే పొలిటికల్ ట్రాక్ లోకి వస్తున్నాడు. ఈ అనుభవాన్నంతటినీ కూడ గట్టుకుని వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్ధులపై చూపించనున్నాడు. కాసేపు ఆ విషయం పక్కనబెడితే.. ఇప్పుడు తెలుగు రాష్ర్టాల మధ్య కృష్ణా నీటి పై వివాదం రేగిన సంగతి తెలిసిందే. మూడు టీఎంసీల నీటిని పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ తరలించాలని ఏపీ ఇచ్చిన జీవో పై తెలంగాణ ప్రభుత్వం భగ్గుమంది.
ప్రస్తుతం ఆ పంచాయతీ కృష్ణా బోర్డు ఫరిదిలో ఉంది. దీనిపై ఇప్పటికే బీజేపీ తన వైఖరెంటో స్పష్టంగా చెప్పేసింది. ఆ విషయంలో ఏపీ ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని బీజీపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారయణ క్లారిటీ ఇచ్చేసారు. ఇక ప్రతిపక్ష నేత చంద్రబాబు సెలెంట్ గా ఉన్నాడు. ఆయనగారు ఎలాగూ ఈ విషయంపై మాట్లాడరని ఓ క్లారిటీ కూడా వచ్చేసింది. ఇక బ్యాలెన్స్ జనసేనాని పవన్ కళ్యాణ్ ఒక్కడే. ఇప్పటివరకూ ఈయన కూడా ఈ వివాదంపై ఎలాంటి కామెంట్ చేయలేదు. తప్పు ఏపీదా? తెలంగాణ? అని చెప్పకుండా హోమ్ క్వారైంటన్ లో ఉంటూ ఈ విషయం తప్ప మిగతా అన్ని విషయాలపై ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు.
మరి ఈ మౌనానికి కారణం ఏంటి? అంటే పవన్ ఎవరి వైపు వకల్తా పుచ్చుకుని మాట్లాడినా తన ఇమేజ్ కైతే డ్యామేజ్ తప్పదు. ఇటీవలే ముఖానికి మళ్లీ మేకప్ వేసుకున్న సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పుడు గనుక ఈ విషయంలో వేలుపెడితే తన ఫాలోయింగ్ అంతా పొతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ లోనో…కృష్ణా డ్యామ్ లోనే కలిసిపోయే ప్రమాదం ఉంది. అందుకే జనసేనాని ఈ విషయంపై సైలెంట్ గా ఉన్నట్లున్నాడు.