చంద్రబాబు మీద తిరగబడుతున్న నందమూరి ఫ్యామిలీ ? జూనియర్ సారథ్యంలో ??

TDP seniors should put pressure on Chandrababu Naidu
టీడీపీ అధినేత, విపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గారి చర్యలు ఒక్కోసారి టీడీపీ లో కలకలం సృష్టిస్తుంటాయి.  అది కూడ పార్టీకి మూలమైన నందమూరి కుటుంబం వైపు నుండి కావడం మరిన్ని వివాదాలకు తావిస్తోంది.  బాలకృష్ణ తర్వాత నందమూరి ఫ్యామిలీ నుండి ప్రజాదరణ కలిగిన వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్.  ఎప్పటికైనా తాత నెలకొల్పిన పార్టీకి వారసుడు అతనేనని నమ్ముతుంటారు అభిమానులు.  పార్టీ శ్రేణుల్లో కూడ వర్గానికి తారక్ అంటే వల్లమాలిన అభిమానం.  తారక్ పార్టీలోకి రాకపోతాడా మళ్లీ పూర్వ వైభవం తీసుకురాకపోతాడా అనేది వారి విశ్వాసం.  ఆ విశ్వాసం చుట్టూ ఎన్నో ప్రతికూలతలు, అవరోధాలు ఉన్నా వారు మాత్రం దాన్నే నమ్ముతుంటారు.  ఆ నమ్మకం నిజమవుతుందా లేదా అనే విషయాన్ని పక్కనపెడితే అసలు చంద్రబాబు మూలంగా తలెత్తుతున్న వివాదాలేంటో చూద్దాం.
 
Fans demands NTR to fight against Chandrababu Naidu
Fans demands NTR to fight against Chandrababu Naidu

జూనియర్ ఎన్టీఆర్ కు  చంద్రబాబు నాయుడు అంటే ఒక అంచనా, నమ్మకం ఉన్నాయి.  అయితే అవి పాజిటివ్ తరహావి మాత్రం కాదులెండి.  గతంలో ఎన్నికల సమయంలో తారక్ ను రాజకీయాల్లోకి దింపి పార్టీ ప్రచారానికి బాగా వాడుకున్నారు.  తారక్ కూడ బాబుగారి పిలిచి మరీ పని చెప్పడంతో గట్టిగా పనిచేశారు.  ప్రమాదానికి గురైనా స్ట్రెచర్ మీద నుండి పార్టీ గెలుపు కొరకు పిలిపునిచ్చిన నిబద్దత ఆయనది.  కానీ ఆ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది.  అంతే.. ఆ తర్వాత బాబుగారి అసలు రంగు బయటపడింది.  తారక్ కు పూర్తిగా సైడ్ చేసేశారు.  ఓటమి తర్వాత కనీసం కన్నెత్తి కూడ చూడలేదు.  అదే తారక్ ను బాగా కలచివేసింది.  ఇప్పటికీ తారక్ విషయంలో చంద్రబాబు నాయుడు మారలేదు.

 
అప్పుడప్పుడు తన నిర్లక్ష్యాన్ని చూపిస్తూనే ఉన్నారు.  పలువురి తెలుగు హీరోలు పుట్టినరోజు నాడు పనిగట్టుకుని మరీ ట్వీట్లతో శుభాకాంక్షలు చెప్పిన బాబు తారక్ పుట్టినరోజు విష్ చేయలేదు.  ఇది అభిమానుల్ని బాగా నొప్పించింది.  ఇక నిన్న తారక్ తండ్రి, దివంగత టీడీపీ నేత అయిన హరికృష్ణ వర్థంతి.  ఆ సందర్భంగా సీబీఎన్ ‘నందమూరి హరికృష్ణగారంటే ఆపన్నులకు అండగా నిలిచే ఆత్మీయత, క్రమశిక్షణ, నిరాడంబరతలకు ప్రతిరూపం.  హరికృష్ణగారి వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యునిగా, శాసనసభ్యునిగా, రాజ్యసభ సభ్యునిగా ప్రజలకు, పార్టీకి ఆయన చేసిన సేవలు స్మరించుకుంటూ, ఆయన స్మృతికి నివాళులు’ అంటూ ట్వీట్ చేశారు.  దీంతో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ కు చంద్రబాబు నాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదనే విషయం గుర్తుకొచ్చింది అభిమానులకు.  అంతే బాబు మీద విరుచుకుపడ్డారు.  ఇకనైనా ఆయన మీద తారక్ తిరగబడాలని, పార్టీ పగ్గాలు చేజెక్కించుకోవాలని సోషల్ మీడియాలో చర్చ పెట్టారు.  మరి వారి కోరికను జూనియర్ ఎన్టీఆర్ ఆలకిస్తాడా లేదా అనేది భవిష్యత్తే నిర్ణయించాలి.