ప్రముఖ గాయకుడుగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న కృష్ణ కుమార్ (కేకే) మంగళవారం సాయంత్రం అకాలమరణం పొందారు.ఒక సంగీత వేడుకల్లో భాగంగా ఆయన తన పాటలతో అందరినీ సందడి చేశారు.ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం హోటల్ చేరుకున్న తరువాత ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈయనకి గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
ఇలా ఆయన మరణవార్త తెలుసుకున్న ఎంతోమంది ప్రముఖులు ఆయన మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
ఇకపోతే వివిధ భాషలలో ఎన్నో వందల పాటలు పాడిన ఈయన అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు పొందారు. ఈ విధంగా అన్ని భాషలలోనూ ఎంతో కఠినతరమైన పాటలను కూడా ఎంతో అవలీలగా పాడేవారు. ఇకపోతే ఈయన ఒక్కో పాటకు తీసుకునే రెమ్యునరేషన్ గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కేకే ఒక పాట పాడటం కోసం సుమారు 3 నుంచి 5 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకునే వారట.
లో బడ్జెట్ చిత్రాలు అయితే ఈయన రెమ్యూనరేషన్ లో కూడా చాలావరకు తగ్గించుకొనే వారని ఆయన సన్నిహితులు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఇకపోతే సంగీతంలో కూడా తనకంటూ కొన్ని హద్దులు ఉన్నాయని ఎప్పుడూ కూడా వాటిని క్రాస్ చేయనని కేకే ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. తనకు ఎంతో పెద్ద ధనవంతులు గొప్పవాళ్ళు వారి వ్యక్తిగత కార్యక్రమాలకు పాటలు పాడటానికి ఆహ్వానిస్తూ ఉంటారు. అయితే వాళ్లు కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా తాను మాత్రం అలాంటి వేడుకలలో పాటలు పాడనని ఈయన తెలియజేసేవారు.