Crime News: ప్రస్తుత కాలంలో ప్రతి వస్తువుకి వాటికి సంబంధించిన వస్తువులను తయారు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే ఇటీవల ఒకటి వెలుగులోకి వచ్చింది. నకిలీ మందులను తయారు చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకోవాలని ప్రయత్నించిన వ్యక్తి ప్రస్తుతం కటకటాలపాలయ్యాడు. వివరాలలోకి వెళితే.. అధిక మొత్తంలో డబ్బు సంపాదించాలన్న ఆశ తో మెడికల్ రిప్రజెంటేటివ్గా పని చేసిన అనుభవం తో మార్కెట్లో ఎక్కువగా డిమాండ్ ఉన్న థైరాయిడ్ మందులకు నకిలీ మందులు తయారుచేసి మార్కెట్లో వాటిని విక్రయిస్తున్నాడు.
ఇటీవల నరసరావుపేట లో నకిలీ థైరాయిడ్ మందులు విక్రయిస్తున్నారని సమాచారం రావడంతో ఏపీ డ్రగ్ కంట్రోల్ అధికారులు అప్రమత్తమై ఆ టాబ్లెట్ లను సేకరించి ల్యాబ్ కి పంపి పరీక్షలు నిర్వహించగా అవి నకిలీ టాబ్లెట్లని నిరూపణ అయింది. దీంతో నరసరావుపేటలో ఈ మందులను విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు విచారించగా తాను ఆ మందులలో ఎక్కడినుండి కొంటున్నాడు అన్న విషయం పోలీసులకు తెలియజేశాడు.
కర్ణాటకలోని హుబ్లి కి చెందిన జైయేశ్ అనే వ్యక్తి ఈ నకిలీ మందులు తయారు చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు. జైయేశ్ వద్ద ఉన్న నకిలీ గుర్తింపు కార్డులు, లెటర్ హెడ్, మూడు లక్షల రూపాయల విలువ చేసే నకిలీ మందులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నకిలీ మందులను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు ఎగుమతి చేసినట్టు విచారణలో వెల్లడైంది. ఎవరికీ అనుమానం రాకుండా చివరికి హోల్ గ్రామ్ కూడా మందుల పెట్టెలపై ఉండటంతో పోలీసులు అవాక్కయ్యారు. ఈ ఘటన గురించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ముమ్మరం చేశారు.