Crime: టెక్నాలజీ ఎంత డెవలప్ అయినప్పటికీ ఇప్పటికీ కొన్ని గ్రామాలలో మూఢ నమ్మకాలు బలంగా విశ్వసిస్తారు. అలా మూఢనమ్మకాలను నమ్మే వారి బలహీనతను ఆసరాగా చేసుకుని చాలామంది నకిలీ బాబాలు అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఓ మారుముల ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన పెద్ద కూతురికి ఎన్ని సంబంధాలు చూసిన పెళ్లి కావడంలేదని,తన కూతురికి ఏమైన దోషం ఉందేమో అని భావించి,యోలా తాలుకాలోని నాగ్డే గ్రామంలోని ఓ బాబాను ఆశ్రయించగా,సదరు మహిళ ఆవేదనను ఆసరాగా తీసుకున్న బాబా యువతిపై చేతబడి జరిగిందని చెప్పి పరిష్కారానికి అతను ఇచ్చే జలాన్ని తాగాలని సూచించాడు.
ఆ జలాన్ని తాగి తల్లితో సహా ముగ్గురు యువతులు స్పృహ తప్పి పడిపోయారు. స్పృహలో లేని వారిపై సోదరుడితో కలిసి దొంగబాబా అత్యాచారం చేశాడు.అందుకు సంబంధించిన దృశ్యాలను వీడియో తీసి ఎవరికైన చెబితే సోషల్ మీడియాలో పెడతానని వారిని లోబరుచుకుని రెండున్నరేళ్లుగా తల్లితో పాటు ఆ యువతులపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఇక ఇటీవల డబ్బులు కూడా డిమాండ్ చేయడంతో చివరికి నకిలీ బాబా వేధింపులు తట్టుకోలేక బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.