Crime: పూర్వకాలంలో మూఢ నమ్మకాలు ఎక్కువగా ఉండేవి. ఈ ఆధునిక కాలంలో మూఢనమ్మకాలు కొంత మేరకు తగ్గినా కూడా అక్కడ అక్కడ ఇంకా ప్రజలు వాటిని నమ్ముతూ మోసపోతున్నారు. మూఢనమ్మకాలు నమ్మే వారి కోసం దొంగ బాబాలు పుట్టుకొస్తున్నారు. ఈజీగా డబ్బు సంపాదించవచ్చు అన్న ఆలోచనతో ప్రస్తుతం చాలా మంది బాబాల అవతారం ఎత్తుతున్నారు. ఇలాంటి వారిని నమ్మి చాలామంది మోసపోతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది.
ఇటీవల మహారాష్ట్రలు ఇటువంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది.వివరాలలోకి వెళితే..మహారాష్ట్రలోని థానే జిల్లాకు చెందిన ఓ మహిళ తన ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నాయని మూఢనమ్మకంతోజల్గావ్ జిల్లాకు చెందిన బాబా కలిసి, తన ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నాయని చెప్పగా, వాటిని తరిమివేసే శక్తి తనకు ఉందని దొంగ బాబా మహిళను నమ్మించాడు. దీంతో ఆ బాబాను నమ్మిన మహిళ అతడికి భారీ మొత్తంలో డబ్బులు ఇచ్చింది.
ఆ మహిళ బాబాకు 32 లక్షల వరకు డబ్బులు, ఖరీదైన వస్తువులు సమర్పించుకుంది. అయితే ఎన్ని డబ్బులు ఇచ్చినా తన ఇంట్లో సమస్యకు ఏ విధమైన పరిష్కారం లభించక పోవడంతో ఆ మహిళకు బాబా మీద అనుమానం వచ్చింది. ఆ తర్వాత ఆ దొంగ బాబా అసలు నిజస్వరూపం తెలిసి ఆశ్చర్య పోవడం మహిళ వంతయింది. వెంటనే ఆ మహిళ ఈ విషయం గురించి పోలీసులను ఆశ్రయించి దొంగ బాబా పై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి దొంగ బాబాను అరెస్ట్ చేశారు.