మరో సారి ప్రేమలో పడ్డ నరేష్

సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ రియల్ లిఫ్ లో మాత్రం సీనియర్ యాక్టర్ నరేష్ చాలా రొమాంటిక్. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్ కొంత కాలంగా పవిత్ర లోకేష్ తో కలిసి ఉంటున్నాడు. తాను, పవిత్ర ఇద్దరం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం, కానీ పెళ్లి మాత్రం చేసుకునే ఆలోచనే లేదని చాలా సార్లు చెప్పాడు.

వీరిద్ద‌రూ బెంగుళూరులో ఓ హోట‌ల్ లో ఉండ‌గా న‌రేశ్ మూడో భార్య రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకుంది. అయితే అప్ప‌టి నుంచే వీరిద్ద‌రూ కూడా సోష‌ల్ మీడియాలో చాలా ఫేమ‌స్ అయిపోయారు. ఇద్ద‌రి పేర్ల‌ను దారుణంగా ట్రోల్స్ చేశారు నెటిజ‌న్లు.

ఇప్పుడున్న సమాచారం ప్రకారం నరేష్, పవిత్ర లోకేష్ ని కూడా వదిలేసాడని తెలుస్తుంది. ఇందుకు ఆయ‌న కొత్త గ‌ర్ల్ ఫ్రెండ్ కార‌ణం అని తెలుస్తోంది. ఆమె ఇప్ప‌టికే చాలా సినిమాల్లో హీరోయిన్‌గా చేసి ఫేడవుట్ అయిపోయింది.

ఆ ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్ తో నరేష్ కొంత కాలం గా క్లోస్ గా ఉంటున్నాడంట. ఆ హీరోయిన్ వల్లే ఇప్పుడు పవిత్ర లోకేష్ ని పక్కన పెట్టాడని తెలుస్తుంది. దీని పై నరేష్ మాత్రం ఇంకా స్పందించలేదు.