తప్పంతా డిప్యూటీ స్పీకర్ దేనా ?? ఫస్ట్ రోజు అసంబ్లీ లో ఏం జరిగింది అసలు ?

chandrababu naidu at assembly

 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మొదటిరోజునే యుద్ధ వాతావరణాన్ని తలపించాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు తో సహా 13 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయటం వరకు పరిస్థితులు దారితీశాయి, అయితే ఈ రభసకు కారణం అధికారపక్ష నేతలు, అదే విధంగా డిప్యూటీ స్పీకర్ కారణమనే మాటలు వినిపిస్తున్నాయి.

chandrababu naidu at assembly

 రైతులకు నష్టపరిహారం ప్రకటన అంశంపై చర్చలో పంటల బీమా ప్రీమియంను చెల్లించామని వ్యవసాయ మంత్రి కన్నబాబు ప్రకటించారు. అసెంబ్లీలో అబద్ధాలు చెప్పవద్దని.. ప్రీమియం చెల్లించలేదని, నిరూపిస్తామని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సవాల్ చేశారు. ప్రీమియం చెల్లించలేదని ఆర్టీఐ ద్వారా తీసుకొచ్చిన సమాచారం తన వద్ద ఉందని పత్రాలను కేశవ్ చూపించారు. దీంతో.. వెంటనే అధికార పక్షం మాట మార్చింది. డిసెంబర్‌ 15న ప్రీమియం చెల్లిస్తామని చెప్పుకొచ్చారు. వైసీపీ తీరుపై టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.

 మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని చంద్రబాబు కోరారు. స్పీకర్ చైర్‌లో ఉన్న డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి వెంటనే అవకాశం ఇచ్చారు. ఇలా మైక్ ఇవ్వడంపై జగన్ అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో అధికార పక్షం నిరసన వ్యక్తం చేయడంతో చంద్రబాబు మైక్‌ కట్‌ చేశారు. దీనితో చంద్రబాబు ఆవేశంగా మాట్లాడుతూ ఏకంగా స్పీకర్‌ వెల్‌లో వచ్చి, అక్కడే బైఠాయించి నిరసన తెలియచేశారు.

 ఈ క్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ చంద్రబాబు రౌడీయిజం చేస్తున్నారని, టీడీపీ సభ్యులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని… డిసెంబర్ నెలాఖరునాటికి రైతులందరికీ ఇన్‌పుట్ సబ్సిడీ అందిస్తామని ప్రకటించారు. చంద్రబాబు కావాలనే పోడియం ఎదుట బైఠాయించారని.. గతంలో ఏ ప్రతిపక్ష నేత ఇలా వ్యవహరించలేదన్నారు. తన వయసుకు తగ్గట్టు చంద్రబాబు మాట్లాడాలని.. కళ్లెర్రజేసి మమ్మల్ని భయపెడుతున్నారని మండిపడ్డారు. స్పష్టత ఇచ్చాక కూడా.. అదే అంశాన్ని లేవనెత్తడం సరికాదన్నారు.

 ఆ తర్వాత కూడా చంద్రబాబు స్పీకర్ వెల్ నుండి వెళ్లకపోవడంతో సభ నుండి చంద్రబాబుతో సహా 13 మంది టీడీపీ ఎమ్మెల్యే లను సస్పెండ్ చేసి, మార్షల్స్ తో బయటకు పంపించారు. బయటకు వచ్చిన టీడీపీ నేతలు అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు. చంద్రబాబు కు మైక్ ఇచ్చిన స్పీకర్ తగిన సమయం ఇచ్చి, చంద్రబాబు వాదనను కూడా వినిన తర్వాత మైక్ కట్ చేస్తే బాగుండేది, అలా కాకుండా వైసీపీ సభ్యులు ఆందోలన చేయటంతో బాబు మైక్ కట్ చేయటం, ఆ తర్వాత బాబు వెల్ లోకి వచ్చి నిరసన తెలపటం ఆ తర్వాత సస్పెండ్ చేయటం వరకు వెళ్ళింది పరిస్థితి