టీడీపీ మాజీ ఎమ్మెల్యే మృతి.. అస‌లు కార‌ణం ఇదే..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే జ‌నార్థ‌న్ థాట్రాజ్ గుండెపోటుతో మృతి చెందారు. ఆయ‌న‌కు గుండెపోటు రావడంతో అక్క‌డికి అక్క‌డే కుప్ప‌కూలిపోయారు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌ కుటుంబ సభ్యులు విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అక్క‌డ చికిత్స పొందుతూ జ‌నార్థ‌న్ క‌న్నుమూశారు. ఇక మీజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు మేనల్లుడు అయిన జ‌నార్థ‌న్ 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున కురుపాం నియోజ‌క‌వ‌ర్గం నుండి బరిలోకి దిగాలని ప్ర‌య‌త్నించారు. అయితే కుల స‌ర్టిఫికేట్ కార‌ణంగా జ‌నార్థ‌న్ నామినేష‌న్ తిర‌స్క‌రించ‌బ‌డింది. ఇక జనార్దన్ మ‌ర‌ణ‌ వార్తతో టీడీపీ శ్రేణులు విషాదంలో మునిగిపోగా, ఆయ‌న కుంటుంబంలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి.