YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి రాజకీయాలలో ఎంతో యాక్టివ్ అయ్యారు .ఈయన కూటమి పార్టీల అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత కాలం పాటు బెంగళూరు ప్యాలెస్ పులివెందుల అంటూ కాస్త వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించారు అయితే కూటమి ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు పూర్తి అయినప్పటికీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత రావడంతో జగన్మోహన్ రెడ్డి సైతం జనాలలోకి వస్తున్నారు.
ఈ క్రమంలోనే వైఎస్ జగన్ ఇటీవల గుంటూరులో మిర్చి యాడ్ వెళ్లే అక్కడ మిర్చి రైతుల కష్టాలను అడిగి తెలుసుకోవడమే కాకుండా ప్రభుత్వం రైతుల పట్ల చూపిస్తున్న పక్షపాతం గురించి కూడా ప్రశ్నించారు. అయితే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించి జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డ్ రైతుల పరామర్శకు వెళ్లడంతో ఆయనపై ఏకంగా తొమ్మిది సెక్షన్ల కింద కేసు నమోదు అయింది.
జగన్మోహన్ రెడ్డితో పాటు మరో కొంతమంది నాయకులపై కూడా ఎన్నికల సంఘం కేసు నమోదు చేయడంతో జగన్ స్పందించారు. మీరు ఎన్ని కేసులు పెట్టిన తాను భయపడేది లేదని తెలిపారు. తాను రైతు పక్షపాతి అని ప్రజల పక్షపాతిని. మీరు ఎన్ని కేసులు పెట్టినా రైతుల కోసం, ప్రజల కోసం నిలబడతాను అని జగన్ తేల్చి చెప్పారు. ఇప్పటికైనా మిర్చి రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోండని ఈయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఇలా మీరు ఎన్ని కేసులు పెట్టిన ఆ కేసులకు తాను భయపడను నేను ప్రజల కోసం చేస్తున్న ఈ పోరాటాన్ని ఆపనని ఈయన తెలియజేశారు.మిర్చి రైతులకు బాసటగా వెళ్లినందుకు మాపై కేసులు పెట్టారు. అలాంటప్పుడు ఈ ఫిబ్రవరి 15న, మీరు పాల్గొన్న మ్యూజికల్ నైట్‌కు ఎన్నికల కోడ్ అడ్డం రాలేదా? నేను మిర్చి రైతులను కలుసుకుంటే ఎన్నికల కోడ్ అడ్డు వచ్చిందా? పైగా మేము ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. నిన్నటి కార్యక్రమంలో పలానా వారికి ఓటు వేయమని కూడా మేము ఎక్కడ చెప్పలేదు.కనీసం మైక్‌లో కూడా మాట్లాడలేదు. అయినా అన్యాయంగా కేసులు పెట్టారు. ఇది అప్రజాస్వామికం కాదా అంటూ చంద్రబాబును ప్రశ్నిస్తూ ఈయన సుదీర్ఘమైన పోస్ట్ చేశారు.
