KCR: రాజకీయాలలో యాక్టివ్ అయిన కెసిఆర్… మాజీ మంత్రి హరీష్ రావుకు కీలక బాధ్యతలు!

KCR: తెలంగాణలో 2023 ఎన్నికలలో కాంగ్రెస్ అధిక మెజారిటీని సాధించి అధికారంలోకి వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత పది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఈసారి అధికారం కోల్పోయారు దీంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్ కి పరిమితం అవుతూ ఇన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకున్నారు.

ఇలా ఏడాది పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి ఈయన తిరిగి రాజకీయాలలో చాలా యాక్టివ్ అవుతున్నారు. ఈ క్రమంలోనే చాలా విరామం తర్వాత తెలంగాణ భవన్లోకి అడుగుపెట్టిన ఈయన పార్టీ శ్రేణులతో సమావేశం అయ్యారు. బీఆర్ఎస్ మరోసారి తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసిన కేసీఆర్, పార్టీ శ్రేణులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఒక సంవత్సరం పాటు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక తెలంగాణలో మన పార్టీ బలోపేతం చేసుకోవడం కోసం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏప్రిల్ 10 నుండి ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయించారు. పార్టీ కార్యకలాపాలను మరింత మెరుగుపరచడం కోసం కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ముఖ్యంగా ఈ కమిటీ ఏర్పాటు కోసం ఇన్చార్జిగా మాజీ మంత్రి హరీష్ రావుకు బాధ్యతలు అప్పగించారు. బీఆర్ఎస్ మహిళా విభాగం ఏర్పాటుకు కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇలా వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజలలో వ్యతిరేకతను ఏర్పరిచి తమ పార్టీని బలోపేతం తీసుకునే దిశగా కెసిఆర్ సరికొత్త వ్యూహాలను రక్షిస్తూ తిరిగి రాజకీయాలలో ఎంతో యాక్టివ్ అవుతున్నారు.