దుబ్బాక ఉపఎన్నికల్లో మూడు పార్టీలు పోటీకి దిగినా ప్రధానమైన పోటీ మాత్రం తెరాస, కాంగ్రెస్ పార్టీల నడుమనే ఉండనుంది. అనూహ్యంగా ఆఖరి నిముషంలో తెరాసను కాదని చెరుకు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టలో చేరిపోవడం, అధిష్టానం టికెట్ కేటాయించడం చకచకా జరిగిపోవడంతో ఉప ఎన్నికల్లో పోటీ తీవ్రమైపోయింది. అప్పటివరకు భారీ మెజారిటీ అనుకున్న తెరాస గెలిస్తే చాలానే పరిస్థితికి వచ్చింది. కాంగ్రెస్ ఏమో తెరాసను ఢీకొట్టగల అభ్యర్థి దొరికినందుకు రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళుతోంది. ఇప్పుడు ప్రధానంగా ఈ ఎన్నికల్లో రెండే అంశాలు పనిచేయబోతున్నాయి.
అవే ఒకటి సానుభూతి, ఇంకొకటి తిరుగుబాయి. కేసీఆర్ ఏమో సానుభూతి ఓట్ల కోసం రామలింగారెడ్డి సతీమణి సుజాతకే టికెట్ కేటాయిస్తే కాంగ్రెస్ పార్టీ ఏమో కేసీఆర్ చేతిలో మోసపోయానని చెప్పుకుంటున్న శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఇచ్చింది. ఈ రెండు అంశాల మీదే ప్రస్తుతం దుబ్బాకలో ప్రచారం జరుగుతోంది. అసలు రాజకీయాలంటే పెద్దగా అవగాహన్ లేని సుజాతకు తోడుగా హరీష్ రావు లాంటి వారు తిరుగుతూ మన రామలింగారెడ్డి భార్య, న్యాయంగా ఈ పదవి రామలింగారెడ్డి కుటుంబానికే దక్కాలి కాబట్టి సుజాతను గెలిపించండి అంటూ తిరుగుతుంన్నారు.
ఇక కాంగ్రెస్ పార్టీ ఏమో ఇదిగో చెరుకు శ్రీనివాస్ రెడ్డి మన ముత్యంరెడ్డి కుమారుడు, కేసీఆర్ చేతిలో మోసగింపబడ్డాడు. ఇప్పుడు తిరుగుబాటు చేస్తున్నాడు. గెలిపించాల్సిన బాధ్యత మీదే అంటూ ఊదరగొడుతున్నారు. మధ్యలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ వరుసగా పోటీచేస్తున్న, ఇన్నిసార్లు ఓడిపోతూనే ఉన్నాను, ఈసారైనా గెలిపించండి అంటూ జాలి కోసం వెతుక్కుంటున్నారు. ఇలా సానుభూతి, మోసం, జాలి అనే మూడు ప్రభావితమైన అంశాలు పోటీలో పోటీలో ఉన్నాయి. మరి మూడింటిలో ఏది దేని మీద పైచేయి సాధిస్తుందో చూడాలి.