జబర్దస్త్ జడ్జిగా లక్షల్లో రెమ్యూనరేషన్ తీసుకున్నా : రోజా

రోజా వెండితెర నటిగా మాత్రమే కాకుండా బుల్లితెరపై పలు కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోని గత పది సంవత్సరాల నుంచి ఈమె జబర్దస్త్ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ ఎంతో మంచి ప్రేక్షకాదరణ సంపాదించుకుంది.ఇలా జబర్దస్త్ ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న రోజాకు ప్రస్తుతం మంత్రి పదవి రావడంతో ప్రోటోకాల్ ప్రకారం తాను జబర్దస్త్ కార్యక్రమం నుంచి కూడా తప్పకున్న విషయం మనకు తెలిసిందే.

ఇక తాను ప్రస్తుతం రాజకీయ నాయకురాలుగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష నేతలు నుంచి ఎన్నో విమర్శలను ఎదుర్కొంటుంది. అయితే తాజాగా కోట్లు ఖరీదు చేసే కారును కొనుగోలు చేసిన రోజాకు ఇలాంటి విమర్శలు తప్పలేదు.ఈమె అక్రమ సంపాదన వల్ల ఇలా ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తుందనీ ప్రతిపక్ష నేతలు విమర్శలు చేయడంతో వారికి సమాధానం చెబుతూ ఘాటుగా స్పందించారు.అక్రమ సంపాదనతో కొనుగోలు చేయాల్సిన అవసరం తనకు లేదని తాను 150 సినిమాలలో హీరోయిన్గా నటించానని, అలాగే పది సంవత్సరాలు పాటు జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించి లక్షల్లో రెమ్యూనరేషన్ తీసుకున్నానని తెలిపారు.

ఇకపోతే ప్రతిపక్ష నాయకులకు ఎవరికైనా అనుమానం ఉంటే తాను కట్టే ఇన్కమ్ టాక్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు అంటూ ఈమె తన గురించి విమర్శలు చేస్తున్న వారికి గట్టిగా కౌంటర్ ఇచ్చారు.ఇలా స్వయంగా రోజా తాను జబర్దస్త్ కార్యక్రమంలో ఉన్నప్పుడు లక్షల్లో రెమ్యూనరేషన్ తీసుకున్నాను అంటే ఈమె గత పది సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాల ద్వారా కోట్లు వెనకేసి ఉంటారని పలువురు భావిస్తున్నారు. ఏది ఏమైనా రోజా ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో ఎంతోమంది అభిమానులు రోజాను చాలా మిస్ అవుతున్నారని చెప్పాలి.