హద్దులు దాటిన ఇమాన్యుల్.. వర్షిని ఏకంగా తుప్పల్లోకి రమ్మంటూ?

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిన విషయమే. గత తొమ్మిది సంవత్సరాలుగా ఈ టీవీలో ప్రసారం అవుతున్న ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ముఖ్యంగా జబర్దస్త్ షో లో లవ్ ట్రాక్ ల వల్ల చాలామంది పాపులర్ అయ్యారు. అటువంటి వారిలో సుధీర్ రష్మీ జంట మొదటిది అని చెప్పవచ్చు. జబర్దస్త్ స్టేజి మీద వీరిద్దరి మధ్య రొమాన్స్ కారణంగా వీరిద్దరూ బాగా పాపులర్ అయ్యారు. నిజజీవితంలో వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని అపోహ పడ్డారు. కానీ అది కేవలం ఆన్ స్క్రీన్ మీద మాత్రమే అంటూ రష్మీ చాలాసార్లు క్లారిటీ ఇచ్చింది.

ఇలా జబర్దస్త్లో లవ్ ట్రాక్ ల వల్ల పాపులర్ అయిన వారిలో సుధీర్- రష్మీ తో పాటు వర్ష-ఇమాన్యుల్, రాకేష్-సుజాత, పరదేశి-రీతు చౌదరి వంటి వారు కూడా బాగా పాపులర్ అయ్యారు. సుధీర్ రష్మీ తర్వాత అంతగా పాపులర్ అయిన జంటలలో వర్ష-ఇమాన్యుల్ జంట ఒకటి. జబర్దస్త్ స్టేజ్ మీద వీరిద్దరూ చేసే రొమాన్స్, డైలాగులు బాగా వర్కౌట్ అయ్యాయి. దీంతో వీరిద్దరూ ఆన్ స్క్రీన్ మీద మాత్రమే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కూడా చాలా క్లోజ్ గా ఉంటున్నారు. అంతేకాకుండా జబర్దస్త్ లో వీరిద్దరికీ ఏకంగా 1,2సార్లు పెళ్లి కూడా చేశారు. దీంతో వీరిద్దరి మధ్య కూడా ప్రేమాయణం నడుస్తుందని చాలా మంది అనుకుంటున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా జబర్ధస్త్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ప్రోమోలో ఇమాన్యుల్ వర్ష మద్య జరిగిన సంభాషణ చూసి ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఇంతకాలం వర్షని ఇష్టపడుతున్నాను అంటూ వెంట పడేవాడు. కానీ ఈ సారి మాత్రం ఏకంగా వర్షని తుప్పళ్లోకి రమ్మని పిలిచాడు. దీంతో అక్కడున్న వారితో పాటు ప్రేక్షకులు కూడా షాక్ అయ్యారు.
టిఆర్పి కోసం జబర్ధస్త్ వాళ్ళు ఇంత నీచానికి కూడా పాల్పడ్డారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి జబర్ధస్త్ కి ముందులా ఉన్న ప్రేక్షకాదరణ మాత్రం ఇప్పుడూ కరువయ్యిందని చెప్పటంలో సందేహం లేదు.