బీహార్ ఎన్నికలు : ఆలస్యం కానున్న ఫలితాలు

election results may be delayed in bihar

బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి దూసుకుపోతోంది. బీహార్ లో ఉన్నది మొత్తం 243 అసెంబ్లీ సీట్లు. అందులో ప్రస్తుతం జరిగిన కౌంట్ ప్రకారం.. ఎన్డీఏ కూటమి 125 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా… 2 స్థానాల్లో గెలిచింది. మహాకూటమి మాత్రం 106 స్థానాల్లో అధిక్యంలో ఉండగా… ఇప్పటి వరకు ఏ స్థానంలో గెలవలేదు. ఇతర పార్టీలు కలిసి ఓ 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

election results may be delayed in bihar

అయితే.. ఇప్పటి వరకు పోలైన ఓట్లలో 92 లక్షల ఓట్లను మాత్రమే లెక్కించారు. నిజానికి బీహార్ లో మొత్తం పోలైన ఓట్లు 4.10 కోట్లు. ఈసారి గతంలో కంటే ఎక్కువ రౌండ్లు ఉన్నాయి. మొత్తం 35 రౌండ్లు ఉండటంతో… సాయంత్రం వరకు ఓట్ల లెక్కింపు కొనసాగే అవకాశం ఉంది. దీంతో ఎన్నికల ఫలితాలు ఆలస్యం కానున్నాయి.