Fire Accident: తాజాగా ఒంగోలు లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పట్టణ శివారులోని వుడ్ కాంప్లెక్స్ వద్ద నిలిచి ఉన్న ఎనిమిది బస్సులు దగ్ధమయ్యాయి. అయితే ఆ బస్సులు కావేరీ ట్రావెల్స్ కు చెందినట్లుగా గుర్తించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు మాత్రమే కాకుండా పొరుగు రాష్ట్రాలకు కూడా ప్రయాణాలను తరలించే ఈ కావేరీ ట్రావెల్స్ బస్సులను మామూలు సమయంలో వుడ్ కాంప్లెక్స్ వద్ద నిలిపి ఉంచుతారు. ఇలా నిలిపి ఉన్న క్రమంలోనే ఆ కాంప్లెక్స్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలోనే దాదాపుగా ఎనిమిది బస్సులు దగ్ధమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన వుడ్ కాంప్లెక్స్ వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు.
అప్పటికే 8 బస్సులు పూర్తిగా కాలిపోయాయి. ఇక 20 బస్సుల వరకు నిలిచి ఉండగా అందులో 8 బస్సులు కాలిపోయాయి. మొత్తంగా ఆరు కోట్ల వరకు నష్టం జరిగి ఉంటుంది అని ట్రావెల్స్ వర్గాలు చెబుతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా గిరాకీలు లేకపోవడంతో బస్సులను ఇక్కడికి ఉంచినట్లు ట్రావెల్స్ కు చెందిన ఒక వ్యక్తి తెలిపారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.