Tharun: అయోధ్య రామయ్య సినిమా అయిపోయిన తర్వాత తాను బెల్లంకొండ సురేశ్‌తో సినిమా చేయాలని అనుకున్నానని డైరెక్టర్ చంద్ర మహేశ్ తెలిపారు. ఆ సినిమాలో అప్పటికే నువ్వే కావాలి సినిమాతో హిట్ కొట్టిన తరుణ్‌ని హీరోగా అనుకున్నామని ఆయన చెప్పుకొచ్చారు. అయితే అప్పుడు ప్రొడ్యూసర్‌కి, తరుణ్‌కి సెట్ కాలేదని, కొన్ని ఇగో క్లాషెస్ వచ్చాయని ఆయన చెప్పారు. ఆ ప్రాసెస్‌లో ఆ స్టోరీ ఆ హీరో నుంచి పక్కకు వెళ్లిపోయిందని ఆయన తెలిపారు. దాంతో వేరే కథను అనుకున్నామని, ఆ మూవీలో హీరోగా వేణును అనుకున్నట్టు ఆయన చెప్పారు. అప్పటికే ఆయన చేసిన చిరునవ్వుతో చాలా సక్సెస్ అయిందని ఆయన తెలిపారు. అక్కడ కూడా సేమ్ ప్రాబ్లమ్ వచ్చిందని, ప్రొడ్యూసర్‌కి ఆయనకి పడలేదని ఆయన స్పష్టం చేశారు.
ఆ తర్వాత ఆ సినిమా కూడా అలా ఆగిపోయిందని రవి చెప్పారు. ఇక మళ్లీ ఆలోచించి అదే కథను వడ్డె నవీన్ గారితో చేయాలని అనుకోగానే, ఆయన్ని సంప్రదించడం, ఆయన ఒప్పుకోవడంతో ఆ మూవీ నవీన్ గారితోనే చేయడం జరిగిందని ఆయన తెలిపారు. నిజానికి తాను వడ్డె నవీన్ గారితో ఆ సినిమా చేద్దామని అనుకోలేదని, ప్రొడ్యూసర్ గారేమో వెంటనే చేయాలని చెప్పేసరికి చేశామని ఆయన అన్నారు. ఎందుకు నవీన్ గారితో అనుకోలేదు అంటే, ఆయన మూడీగా ఉంటారు, సైలెంట్‌గా ఉంటారు, తొందరగా కలవరు ఇలాంటివన్నీ ఆయన గురించి ఏవేవో చెప్పారని రవి అన్నారు. కానీ తాను మాత్రం అప్పటికీ ఆయన్ని ఎప్పుడూ కలవలేదని ఆయన చెప్పారు.
ఇక ఆయన గురించి అన్నీ తెలుసుకొని వడ్డె నవీన్ గారిని కలవడానికి వెళ్లానని, తనతో పాటు రైటర్ ఆకుల శివను కూడా తీసుకొని వెళ్లానని చంద్ర మహేశ్ అన్నారు. అయితే అందరూ చెప్పిన దానికి, తాను విన్నదానికీ, అక్కడ చూసిన దానికి అసలు సంబంధం లేదని ఆయన చెప్పారు. ఆయన చాలా హ్యాపీగా తమను రిసీవ్ చేసుకున్నారని, చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారని ఆయన తెలిపారు. ఫస్ట్ షూటింగ్‌లోనే ఆయన నచ్చడంతో ఆయనతో జర్నీని కొనసాగించానని మహేశ్ అన్నారు. అందరూ చెప్పిన దానికీ ఆయన ఉండేదానికి అసలు సంబంధం ఉండదని, చాలా లవ్లీ పర్సన్ అని ఆయన వివరించారు.