కరోనా వైరస్ వ్యాప్తితో ఇప్పటికే ఏపీ అల్లాడుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం..మరణాల రేటు అదే స్థాయిలో ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వచ్చే ప్రణయాన్ని ఆపెదెవరని ఆందోళనకు గురవు తున్నారు. మనిషిని చూసి మనిషి భయపడుతోన్న రోజులువి. గడిచిన వారం రోజులుగా అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడా రెండు జిల్లాలు హాట్ స్పాట్ లు గా మారాయి. రెండు జిల్లాల్లోను పటిష్టంగా లాక్ డౌన్ అమలవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ ప్రజలకు మరో పెను ప్రమాదం పొంచి ఉందని సమాచారం.
అందులోనూ ఆ ప్రమాదం ఉత్తరాంధ్రకే ఎక్కువగా ఉంటుందని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకూ సముద్ర గర్భంలో భారీగా ఓ చీలిక ఏర్పడిన ఘటన ఇప్పుడు ప్రజల్లో భయాందోళనకు దారి తీస్తోంది. బంగాళాఖాతం సముద్ర గర్భంలో తీరానికి అతి సమీపంలో భారీగా ఓ చీలిక ఏర్పడింది. దాదాపు 300 కిమీ పొడవునా ఈ చీలిక అంతర్భాగంలో బలంగా ఏర్పడిందని సముద్ర అధ్యయన జాతీయ సంస్థ హైదరాబాద్ కేంద్ర విశ్వ విద్యాలయం శాస్ర్తవేత్తలు గుర్తించారు. నదుల నుంచి సముద్రాల్లోకి కొట్టుకెళ్లిన రాళ్లు, మట్టి, తీరం సమీపంలోని కెరటాల ఒత్తిడి కారణంగా గర్భంలో దాదాపు 1000 మీటర్లలోతుగా ఏర్పడినట్లు గుర్తించారు.
గోదావరి ప్రాణహిత గ్రాబెన్ నుంచి నాగావళి ,వంశధార షియర్ జో వరకూ దాదాపు 300 కీలో మీటర్ల పొడవునా 1000 మీటర్లు లోతుగా తెగినట్లు అంచనా వేస్తున్నారు. ఇది ఇప్పుడు ఏర్పడిన చీలిక కాదు. దాదాపు 16 మిలియన్ సంవత్సరాల క్రితమే ఏర్పడిందిట. కానీ తర్వాతి కాలంలో వచ్చి చేరిన మట్టి, రాళ్లు, గులకరాళ్లు, సముద్ర ఉష్ణోగ్రతల కారణంగా మరింత పెరిగిందని అంచనా వేస్తున్నారు. ఇంకా ఆ చీలిక భారీగా పెరుగుతుందని అంచానా వేస్తున్నారు. అదే జరిగితే సమద్రగర్భంలో ఈ చీలక కారణంగా భవిష్యత్ లో కోస్తా తీరం వెంబడి ఉన్న గ్రామాలు , పట్టణాలకు పెద్ద ప్రమాదమే పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు కారణంగా ప్రమాదం ఎప్పుడైనా పొంచి ఉందని శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆ చుట్టు పక్కల ఫార్మా కంపెనీలు కొలువై ఉంటే ప్రమాదానికి ఇంకా దగ్గరగా ఉన్నామని గుర్తించాలని పేర్కొన్నారు.