Actor Suman: ప్రస్తుతం సోషల్ మీడియా చాలా విస్త్రుతం అయింది. ఏ విషయమైనా క్షణాల్లో ప్రజలకు చేరువ అవుతోంది. ప్రపంచంలో ఏమూల ఏం జరిగిన ఇట్టే తెలిసిపోతోంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా కన్నా ఎక్కువగా ప్రజలు సోషల్ మీడియాను నమ్మే పరిస్థితి ఏర్పడింది. దీంతో యూట్యూబ్ ఛానెళ్లు, డిజిటల్ న్యూస్ వెబ్ సైట్లు పుట్టుకోస్తున్నాయి. ఇదిలా ఉంటే నిజమైన వార్తలు తెలియడంతో పాటు సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు కూడా పెరగుతున్నాయి. దీనిపై ఎప్పటికప్పుడు జాగ్రత వహించాల్సి ఉంది. ప్రజల్ని తప్పుదారి పట్టించేలా ఫేక్ న్యూస్ వైరల్ కావడం కూడా కొంతమందికి ఇబ్బందులు కలిగిస్తోంది.
తాజాగా ఇలాంటి ఓ విషయమై యాక్టర్ సుమన్ విషయంలో జరిగింది. సుమన్ తన 110 ఎకరాలను ఆర్మీకి ఇస్తున్నట్లు ఇటీవల ఓ వార్త బాగా వైరల్ అయింది. సామాజిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. అయితే.. తాజాగా నటుడు సుమన్ ఇండియాన్ ఆర్మీకి 117 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చి గొప్ప మనసు చాటుకున్నట్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి.
అయితే ఈ విషయంపై సుమన్ స్పందించారు. నెటిజెన్లు కూడా సుమన్ పై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించారు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తపై సుమన్ స్పందించారు. ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని ఆయన అన్నారు. ఎవరూ నమ్మవద్దని సూచించారు. ఈ భూమి వివాదం ప్రస్తుతం కోర్టులో ఉందని వెల్లడించారు. వివాదం పరిష్కారం అయిన వెంటనే నేనే తెలియజేస్తానని అన్నారు.