వైట్ హౌస్ లో కరోనా కలకలం సృష్టించింది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్ ఇద్దరికీ కరోనా సోకింది. ఇద్దరికీ కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో.. ఇద్దరూ క్వారంటైన్ లోకి వెళ్తున్నట్టు ప్రకటించారు.
నిజానికి వైట్ హౌస్ లో ఉండే ట్రంప్ ముఖ్య సలహాదారు హోప్ హిక్స్ కు ముందు కరోనా సోకింది. దీంతో వెంటనే అప్రమత్తమైన వైట్ హౌస్ సిబ్బంది.. ట్రంప్, ఆయన భార్య మెలానియాకు కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే.. ఆ పరీక్షల్లో ఇద్దరికీ కరోనా పాజిటివ్ అని తేలింది.
దీంతో తాము క్వారంటైన్ లోకి వెళ్తున్నామని.. డాక్టర్ల సూచనలతో అక్కడే చికిత్స కూడా తీసుకుంటామని ట్రంప్ ట్వీట్ చేశారు. అంతకుముందే తన సలహాదారు హోప్ హిక్స్ కు కరోనా సోకినట్టు ట్రంప్ ట్వీట్ చేశారు.
నా సలహాదారు హోప్ హిక్స్.. విరామం లేకుండడా.. విధులు నిర్వర్తించడం వల్ల తనకు కరోనా సోకింది. మేం కూడా టెస్టులు చేయించుకున్నాం. ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా హోం క్వారంటైన్ లోకి వెళ్లాం.. అని ట్రంప్ ట్వీట్ చేశారు.
మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో.. ట్రంప్ దంపతులకు కరోనా సోకడంతో… అక్కడి మున్ముందు ఎలాంటి రాజకీయ మార్పులు చోటు చేసుకుంటాయో అని రాజకీయ విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు.
Tonight, @FLOTUS and I tested positive for COVID-19. We will begin our quarantine and recovery process immediately. We will get through this TOGETHER!
— Donald J. Trump (@realDonaldTrump) October 2, 2020
Hope Hicks, who has been working so hard without even taking a small break, has just tested positive for Covid 19. Terrible! The First Lady and I are waiting for our test results. In the meantime, we will begin our quarantine process!
— Donald J. Trump (@realDonaldTrump) October 2, 2020