Devotional Tips: కాకి పదే పదే మీ ఇంటి పై నైరుతి దిశలో అరుస్తుందా.. దీనికి సంకేతం!

Devotional Tips: సాధారణంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం కాకి అరుపులు కొన్ని సమయాలలో అదృష్టంగా భావిస్తే మరి కొన్ని సమయాలలో శనీశ్వరుడికి ప్రతిరూపంగా భావిస్తారు. శనీశ్వరుడు వాహనం కాకి కావడంతో కాకి మనపై తన్నిన లేదా కాకి మన ఇంట్లోకి వచ్చిన పరమ అరిష్టమని శని ప్రభావం మనపై ఉంటుందని చాలా మంది భావిస్తారు. ఈ క్రమంలోనే కొందరు పురోహితులను పిలిపించి శాంతి హోమాలు నిర్వహిస్తారు. అయితే కొన్నిసార్లు కాకి ఎంతో శుభ ప్రదంగా కూడా భావిస్తాము.

ముఖ్యంగా కాకి అరుపు కొన్నిసార్లు చెడును సూచిస్తే మరికొన్నిసార్లు మంచిని సూచిస్తుంది.కాకి తరచూ పదే పదే మన ఇంటి ప్రాంగణంలో అరిస్తే మనకు ఎన్నో ఆలోచనలు కలుగుతాయి ఏదైనా కీడు జరుగుతుందా లేదా మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతాయి. అయితే కాకి అరుపులో కూడా ఎన్నో భావాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.ముఖ్యంగా కాకి మన ఇంటి నైరుతి దిశలో అరవడం దేనికి సంకేతము అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.

సాధారణంగా నైరుతి మూల కుబేరుడికి అనువైన స్థానం అని చెబుతాము. అందుకే కాకి మన ఇంటి గోడ పై లేదా మేడపై నైరుతి దిశలో కూర్చుని పదే పదే అరిస్తే మన ఇంటికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది అని అర్థం. ఇలా నైరుతిదిశలో కాకి అరవడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఇలా అరవడం వల్ల మన ఇంటికి అనుకోకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని అర్థం.