Spirit: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా వరుస సినిమాలకు కమిట్ అయిన ఈయన ఏమాత్రం తీరిక లేకుండా వరుస షూటింగ్ పనులలో బిజీ అవుతున్నారు. ఇక త్వరలోనే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయే యానిమల్ సినిమా షూటింగ్ పనులు కూడా బిజీ కాబోతున్నారు.
ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర పవర్ఫుల్ గా ఉండబోతుందని అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది ఇక ఇటీవల సందీప్ రెడ్డి యానిమల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ క్రమంలోనే తదుపరి ప్రభాస్ తో సినిమా అంటే ఈ సినిమా పై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు కూడా ఉన్నాయి.
ఇక ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో సందీప్ రెడ్డి హీరో ప్రభాస్ కి కొన్ని కండిషన్లను పెట్టారట. కచ్చితంగా ప్రభాస్ ఈ కండిషన్లు ఫాలో కావాల్సిందేనని సందీప్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తుంది. మరి ప్రభాస్ కోసం సందీప్ రెడ్డి విధించిన ఆ కండిషన్లు ఏంటి అనే విషయానికి వస్తే ..
ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాని జూన్లోనే మొదలు పెట్టాలని కండిషన్ పెట్టారట ఇలా జూన్లో ఈ సినిమా మొదలు పెడితేనే వచ్చే ఏడాది సంక్రాంతిని ఈజీగా టార్గెట్ చేస్తూ విడుదల చేయవచ్చు అనే ఆలోచనలో సందీప్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా సినిమా షూటింగ్ మొదలైన తర్వాత 65 రోజులపాటు కాల్ షీట్స్ గ్యాప్ లేకుండా ఇవ్వాలని కూడా షరతు విధించారట.
ఇలా రెగ్యులర్ షూటింగ్ పనులలో పాల్గొంటూ ఉంటే సినిమాలు తొందరగా పూర్తి చేయవచ్చు. ఇక చివరిగా మరొక కండిషన్ కూడా పెట్టినట్టు తెలుస్తుంది. ఇటీవల కాలంలో బాలీవుడ్ సినిమాలతో పాటు తెలుగు సినిమాలలో కూడా బాడీ డబుల్ లేదా డూప్ సంస్కృతి కనిపిస్తోంది అయితే స్పిరిట్ సినిమా కోసం ప్రభాస్ కి బాడీ డబుల్ అంటే కుదరదని తెలిపారట ఎలాంటి సన్నివేశాలలో అయినా కూడా హీరోనే డైరెక్ట్ గా నటించాలని షరతు విధించినట్టు తెలుస్తుంది.