Katrina Kaif: ఆమ్మో.. కత్రినా కైఫ్ వెడ్డింగ్ రింగ్ ఖరీదు అంతనా?

Katrina Kaif: బాలీవుడ్ ప్రేమజంట కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో ఉంటూ చివరికి డిసెంబర్ 9వ తేదీన రాజస్థాన్ లో వివాహం చేసుకున్నారు. వీరి వివాహానికి అతి ముఖ్యమైన అతిథులు, సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ క్రమంలోనే వీరి పెళ్లిలో ఏ విధమైనటువంటి సెల్ ఫోన్, కెమెరాలను అనుమతించకపోవడంతో వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు పెద్దగా బయట పడటం లేదు. అయితే పెళ్లి తర్వాత కత్రినాకైఫ్ విక్కీ కౌశల్ వారి పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్తా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉండగా కత్రినా కైఫ్ తన పెళ్లికి సంబంధించిన ఫోటోలు మాత్రమే కాకుండా తన నిశ్చితార్థపు ఫోటోలను కూడా షేర్ చేయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఫోటోలలో కత్రినా కైఫ్ ధరించిన నిశ్చితార్థపు ఉంగరం గురించి పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి. కత్రినా ధరించిన నిశ్చితార్థపు ఉంగరం నీలమణితో చేసిన డైమండ్ అమర్చబడి ఉండడంతో చూడగానే ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఈ క్రమంలోనే ఈ ఉంగరం ఎంత ధర ఉంటుంది అంటూ పెద్దఎత్తున చర్చలు పెట్టారు.

ఇక కత్రినా కైఫ్ తన నిశ్చితార్థంలో ధరించిన ఈ ఉంగరం విలువ7,40,000 అని తెలియడంతో అందరూ ఎంతో ఆశ్చర్యపోతున్నారు. అచ్చం ఇలాంటి ఉంగరాన్ని గతంలో బ్రిటన్ యువరాణి తన నిశ్చితార్థంలో ప్రకటించడం విశేషం. అలాగే కత్రినా కైఫ్ తన పెళ్లికి సంబంధించిన వస్త్రధారణ కూడా ఎంతో హైలెట్ గా నిలిచింది ప్రత్యేకంగా ఈమె పెళ్లి కోసం డిజైనర్ సబ్యసాచి ఎంతో అందమైన ఎరుపు లెహంగాను రూపొందించారు.ప్రస్తుతం కత్రినా కైఫ్ కి సంబంధించిన ఈ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.