Sankranthi: ప్రతి ఏడాది జనవరి నెలలో సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగను ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్ర ప్రజలు అంగరంగ వైభవంగా నాలుగు రోజుల పాటు జరుపుకుంటారు. పురాణాల ప్రకారం సూర్యుడు దక్షిణాయన కాలం నుంచి ఉత్తరాయణ కాలంలోకి ప్రవేశిస్తాడు. ఈ క్రమంలోనే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ పండుగను మకర సంక్రాంతి అని జరుపుకుంటారు. ఈ క్రమంలోనే ఈ మకర సంక్రాంతి సూర్యభగవానుడుకి అంకితం కనుక ఈ రోజు ఎవరైతే సూర్యభగవానుడిని పూజిస్తే వారు వారికి సకల సంపదలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.
సంక్రాంతి పండుగ రోజు కొన్ని ప్రాంతాలలో నల్ల నువ్వులతో చేసిన లడ్డూలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. అయితే సంక్రాంతి పండుగలో ఈ నల్ల నువ్వుల లడ్డూలకు ఎందుకంత ప్రాముఖ్యత అనే విషయానికి వస్తే… సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. అయితే ఈ మకర రాశికి శని దేవుడు అధిపతి. అందుకే సూర్య భగవానుడు మకరరాశిలోకి ప్రవేశించగానే శనిదేవుడు నల్లనువ్వులతో సూర్యభగవానుడికి ఆశీర్వాదం పలికారు.
ఈ క్రమంలోనే ఎవరైతే సూర్యభగవానుడిని సంక్రాంతి రోజు నల్లనువ్వులతో పూజిస్తారో అలాంటి వారిపై శని ప్రభావం దోషం ఉండదు.అదే విధంగా సంక్రాంతి పండుగ రోజు నల్లనువ్వులను బెల్లం ఎవరైతే దానధర్మాలు చేస్తారో అలాంటి వారు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా గడుపుతారు.ముఖ్యంగా నల్ల నువ్వులతో తయారుచేసిన లడ్డూలను తినటం వల్ల చలికాలంలో శరీరానికి వేడి చేస్తుంది కనుక నల్ల నువ్వుల లడ్డూలకు సంక్రాంతి పండుగ రోజు అధిక ప్రాధాన్యత ఇస్తారు.