బిగ్ బ్రేకింగ్ : టోటల్ తేల్చుకుని రావడం కోసం .. డిల్లీ బయలుదేరిన జగన్ ?

cm jagan

 ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల లొల్లి ఇప్పట్లో సర్దుమణిగేలా లేకపోగా రాను రాను మరింత తీవ్రతరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఫిబ్రవరి నాటికీ ఎలాగైనా ఎన్నికలను నిర్వహించాలని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సన్నాహాలు చేస్తుంటే ఏపీ సర్కార్ మాత్రం అందుకు ససేమిరా ఒప్పుకోకపోవడంతో ఈ విషయం గవర్నర్ వద్దకు చేరుకుంది, ఆపై హైకోర్టు కు చేరుకునే అవకాశం కనిపిస్తుంది.

cm jagan

 రాష్ట్ర ప్రభుత్వం తనకు సహకరించటం లేదనే కోణంలో నిమ్మగడ్డ హైకోర్టు లో కేసు వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో వైసీపీ సర్కార్ కూడా ఈ విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పై స్వయంగా ఫిర్యాదు చేసే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను అసలు ఏ విధంగా నిర్వహిస్తారని ఆయన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసే అవకాశాలు ఉండవచ్చు.

 త్వరలోనే కేంద్ర ఎన్నికల కమిషనర్ కలిసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ఎప్పుడు జగన్ ఢిల్లీ వెళ్తాడు అనేదానిపై ఇంకా ఎలాంటి స్పష్టత కూడా రావడం లేదు. అయితే సీఎం జగన్ వచ్చే నెల మొదటి వారంలో ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అపాయింట్మెంట్ కూడా సీఎం జగన్ ఎప్పటికీ తీసుకున్నట్టుగా రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

 ఒక పక్క ఎన్నికల కమిషన్ మీద ఫిర్యాదు చేయటం, మరో పక్క పోలవరం విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానం వలన రాష్ట్రానికి జరుగుతున్నా నష్టాన్ని కూడా ప్రధాని దృష్టికి తీసుకోని వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది. 2020 నాటికీ పోలవరం పూర్తిచేస్తామని జగన్ ఇప్పటికే ప్రకటించాడు కాబట్టి, ఢిల్లీ పర్యటనలో దీనిపై దృష్టి పెట్టె అవకాశం ఉందని తెలుస్తుంది. ఒక రకంగా ఈ ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్ అన్ని రకాల విషయాలు తేల్చుకొని వచ్చే అవకాశం ఉంది.