మనసంతా నువ్వే సినిమాను రిజెక్ట్ చేసిన అప్పటి స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సేషన్ హిట్ సాదించిన సినిమాల జాబితాలో సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మించిన ఒక్కడు సినిమా, అలాగే దివంగత నటుడు హీరో ఉదయ్ కిరణ్ నటించిన మనసంతా నువ్వే సినిమాలు తప్పకుండా ఉంటాయి అని చెప్పవచ్చు. ఇక ఈ రెండు సినిమాలను సీనియర్ దర్శక నిర్మాత అయిన ఎం.ఎస్.రాజు నిర్మించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ రెండు సినిమాలకు సంబంధించిన హీరోయిన్స్ ఎంపిక విషయంలో ఒక ఆసక్తికరమైన కథ నడిచింది ఇందుకు సంబంధించిన వివరాలను ఇటీవల ఇంటర్వ్యూలో వెల్లడించారు ఎం.ఎస్.రాజు. ఈ సందర్భంగా ఆయన ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ..

మనసంతా నువ్వే సినిమా కు ముందు తాను భూమిక హీరోయిన్ గా అనుకున్నానని, భూమిక రీమాసేన్ ను కలవడానికి ముంబైకి వెళ్లగా అప్పటికే భూమిక స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది అని భూమిక ఖుషి సినిమా చేసింది అని తెలిపారు ఎం.ఎస్.రాజు. ముందు భూమిక‌ను క‌లిసి ఆమెకు మ‌న‌సంతా నువ్వే సినిమా గురించి అలాగే ఒక్క‌డు సినిమా లైన్ గురించి చెప్పగా అప్పుడు మ‌న‌సంతా నువ్వే, ఒక్క‌డు సినిమాల్లో ఏదైనా ఒక‌టే చేస్తాన‌ని అంది. త‌న‌కు ఒక్క‌డు లైన్ బాగా న‌చ్చింద‌ని దాన్ని చేయ‌డానికి ఆస‌క్తిగా ఉన్నాన‌ని తెలిపిందట. మనసంతా నువ్వే సినిమా చేయ‌డానికి డేట్స్ ప్రాబ్ల‌మ్ ఉన్నాయని తెలిసిందట భూమిక. మ‌న‌సంతా నువ్వే సినిమా స‌మ‌యానికే ఒక్క‌డు క‌థ‌ను రెడీ చేసుకున్నాం అని తెలిపారు.

కానీ స్టార్ట్ కావ‌డానికి ఆల‌స్య‌మైంది. భూమిక‌తో మాట్లాడి వెళ్లిపోయిన త‌ర్వాత రీమా సేన్ వ‌చ్చింది. త‌న‌కు కూడా రెండు క‌థ‌ల‌ను స‌ర‌దాగా చెప్పాను. త‌న‌కు ఒక్క‌డు కంటే మ‌న‌సంతా నువ్వే సినిమా న‌చ్చింద‌ని చెప్పింది. మ‌న‌సంతా నువ్వేలో ఇద్ద‌రు హీరోయిన్స్ ఉంటారు. ఒక హీరోయిన్‌గా భూమిక‌ను అనుకుని మ‌రో హీరోయిన్‌గా రీమా సేన్ తీసుకుందాం అనుకుని మాట్లాదామ‌ని అనుకున్నాం. కానీ ఇద్ద‌రితో మాట్లాడిన త‌ర్వాత ఒక‌రేమో ఒక్క‌డు లైన్ న‌చ్చింద‌న్నారు. మ‌రొక‌రేమో మ‌న‌సంతా నువ్వే లైన్ న‌చ్చింద‌ని అన్నారు. రెండు సినిమాలు హిట్ అయ్యాయి అని చెప్పుకొచ్చారు దర్శక నిర్మాత ఎం.ఎస్.రాజు.