Prabhas: అమ్మాయిని ముద్దాడుతున్న ప్రభాస్… సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫోటో… ఈ బ్యూటీ ఎవరంటే?

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరోగా ప్రభాస్ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. బాహుబలి సినిమా తర్వాత ఈయన క్రేజ్ మరింత పెరిగిపోయిందని చెప్పాలి. బాహుబలి సినిమా తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ప్రభాస్ ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన సలార్ 2, కల్కి2, రాజా సాబ్, స్పిరిట్, ఫౌజి వంటి వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ప్రభాస్ సినిమాలో నటించాలి అంటే ఎవరైనా ఎంతో ఆసక్తి చూపుతుంటారు ఇక ప్రభాస్ విషయానికొస్తే ఆయన తన సినిమా పనులను మాత్రం తను చూసుకుంటూ ఉంటారు ఎలాంటి వివాదాలు జోలికి వెళ్లరు. ఇక అమ్మాయిలు పట్ల ఎంతో గౌరవంగా ఉండే ప్రభాస్ అమ్మాయిలతో మాట్లాడటానికి కూడా ఇష్టపడరు.

ఇలా అమ్మాయిల అంటే ఆమడ దూరం ఉండే ఈయన తాజాగా ఒక అమ్మాయికి ఏకంగా ముద్దులు పెడుతూ హగ్గులు ఇస్తూ ఉన్నటువంటి ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలా ప్రభాస్ ఒక అమ్మాయితో ఇంత చనువుగా ఉండటం ఇదివరకు ఎప్పుడూ కూడా చూడలేదు కానీ ఈ ఫోటో మాత్రం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.

ఇలా ప్రభాస్ ఒక అమ్మాయి పట్ల ఇంత చనువుగా ఉండటం చూసినా అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు మరి ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరు ఏంటి అని ఆరా తీయడం మొదలుపెట్టారు. నిజానికి ప్రభాస్ ఈ ఫోటో ఇప్పుడు తీసుకున్నది కాదని తెలుస్తుంది బాహుబలి సినిమా సమయంలో ఫోటో అని సమాచారం. బాహుబలి సినిమాలో తమన్నా బెస్ట్ ఫ్రెండ్ , మేకప్ ఆర్టిస్ట్ బిల్లి మానిక్‌ అని తెలుస్తుంది. ప్రభాస్ కు అందరితో ఎంతో ఫెండ్లీగా ఉంటారు. అలా బిల్లి మానిక్‌ తోనూ ఎంతో ఫ్రెండ్లీ ఉండేవారు. అప్పటి ఫోటోలు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.