Ntr Son: ఎన్టీఆర్ చిన్న కొడుకు భార్గవ్ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా… అసలు ఊహించలేరుగా?

Ntr Son: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు ఎన్టీఆర్ ఒకరు ఈయన కేవలం తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్టార్ హీరోగా గ్లోబల్ స్టార్ గా కూడా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు ఇటీవల దేవర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొట్టిన ఎన్టీఆర్ ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ పనులలో బిజీగా ఉన్నారు.

ఇకపోతే మరోవైపు బాలీవుడ్ చిత్రం వార్ 2 సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రాబోతున్న డ్రాగన్ సినిమా షూటింగ్ పనులలో కూడా ఎన్టీఆర్ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక ఎన్టీఆర్ సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నా నేపథ్యంలో తన భార్య ప్రణతి మాత్రం తన పిల్లల బాగోగులను అలాగే ఇంటి బాధ్యతలను చూసుకుంటూ ఉన్నారు. ఇక ఎన్టీఆర్ కి ఇద్దరు కుమారులు అనే విషయం మనకు తెలిసిందే.

పెద్ద కుమారుడు అభయ్ రామ్ చిన్న కుమారుడు భార్గవ్ రామ్. ఇక చిన్న కొడుకు భార్గవ్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి ఈ కుర్రాడు చాలా క్యూట్ గా ముద్దుగా కనిపిస్తూ ఉంటారు. ఇకపోతే తాజాగా భార్గవ్ ఫేవరెట్ హీరో ఎవరు అనే విషయం గురించి ప్రస్తుతం ఒక వార్త సంచలనంగా మారింది.

సాధారణంగా ప్రతి ఒక్కరికి కూడా వారి తల్లిదండ్రులే ఫేవరెట్ గా ఉంటారు ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే ఫేవరెట్ హీరో ఎవరు అంటే టక్కున వారి తండ్రి పేరే చెబుతారు కానీ ఎన్టీఆర్ కొడుకు భార్గవ్ రూట్ మాత్రం సెపరేట్ అని చెప్పాలి. తన ఫేవరెట్ హీరో తన తండ్రి ఎన్టీఆర్ కాదని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అని తెలుస్తోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ పుష్ప సినిమా చేసినప్పటి నుంచి తన ఫేవరెట్ హీరోగా మారిపోయారట ఇందులో బన్నీ చెప్పే తగ్గేదే అనే డైలాగ్ భార్గవ్ సైతం తన మేనరిజంలో చూయిస్తూ సందడి చేస్తుంటారని తెలుస్తుంది. ఏది ఏమైనా ఎన్టీఆర్ కొడుకుకు తాను కాకుండా అల్లు అర్జున్ ఫేవరెట్ హీరో అని తెలియడంతో బన్నీ ఫాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.