Super Star Upendra’s Wife : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘గని’లో ఇంపార్టెంట్ రోల్‌లో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర నటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిక్స్‌డ్ టాక్‌తో సినిమా రన్ అవుతోంది.
అయితే, ఉపేంద్ర గురించి చాలా మందికి చాలా విషయాలు తెలుసు. ఆయన మంచి నటుడు మాత్రమే కాదు, మల్టీ టాలెంటెడ్ అని అందరికీ తెలుసు. అయితే, ఆయన భార్య గురించి మాత్రం చాలా కొద్ది మందికే తెలుసు.
ఇంతకీ ఉపేంద్ర భార్య ఎవరో తెలుసా.? అప్పట్లో జె.డి.చక్రవర్తి సినిమా ‘సూరి’లో హీరోయిన్‌గా నటించిన ముద్దుగుమ్మ ప్రియాంకా త్రివేది. ఈమె కూడా కన్నడ భామే. కన్నడ సినిమాలతో పాటు, కొన్ని తెలుగు సినిమాల్లోనూ నటించింది.
ఉపేంద్రతో కలిసి చాలా సూపర్ హిట్ సినిమాల్లో నటించింది ప్రియాంకా. ఆ టైమ్‌లోనే వీరిద్దరి మధ్యా ప్రేమ చిగురించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా ప్రియాంకా త్రివేది కూడా ప్రియాంకా యాక్టింగ్ కంటిన్యూ చేసింది. కానీ, తెలుగులో చేయలేదు.
భర్తకు చాలా సపోర్టింగ్‌గా వుండే భార్య ప్రియాంక. ఉపేంద్ర రాజకీయ పార్టీ పెడితే, వెనక వుండి ఆ పార్టీని నడిపించింది. భర్తపై వచ్చే రాజకీయ విమర్శలను చాకచక్యంగా తిప్పికొట్టింది.
సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ అసోసియేషన్స్ అన్నింటినీ ఏకం చేసి, పార్టీ బాధ్యతల్ని తన భుజాన వేసుకుంది. ఇలా ఒక్కటేమిటీ.. భర్తకు ప్రతీ విషయంలోనూ భార్యగా ప్రియాంకా త్రివేది ఫుల్ సపోర్ట్‌గా వుంటుంది.