Devotional Tips: కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఏ దిశలో ఉంచి కొట్టాలి తెలుసా?

Devotional Tips: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైనా శుభకార్యం జరిగినా లేదా ఆలయాలకు వెళ్ళిన కొబ్బరికాయ కొట్టడం సర్వసాధారణం. ఇలా ప్రతి ఒక్కరు వారి చేసే పనులు విజయవంతం కావాలని దేవుడికి కొబ్బరికాయ కొడుతూ ఉంటారు.అయితే కొబ్బరికాయ కొట్టేటప్పుడు సాధారణంగా మనం ఇష్టానుసారంగా కొబ్బరికాయ కొడుతూ ఉంటాము. కానీ కొబ్బరికాయ కొట్టే విషయంలో కూడా కొన్ని నియమాలను పాటించాలని బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. మరి కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…

సాధారణంగా మనం దేవుడికి కొబ్బరికాయ కొట్టి మన అరిష్టం తొలగిపోయి శాంతిని కలిగించాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తూ ఆలయంలో కొబ్బరికాయ కొడతారు. అదేవిధంగా ఏదైనా శుభకార్యం ప్రారంభించే ముందు ఆ కార్యం లో ఎలాంటి చెడు జరగకుండా నిర్విఘ్నంగా ఆ కార్యం పూర్తి కావాలని భగవంతుడికి ప్రార్థిస్తూ కొబ్బరికాయ కొడతాము. అయితే కొబ్బరికాయ కొట్టేటప్పుడు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి.

మనం కొబ్బరికాయ కొట్టేటప్పుడు కొబ్బరికాయ వెనుక పీచు పట్టుకొని పగలగొట్టాలి. అదేవిధంగా కొబ్బరికాయ పగల కొట్టడానికి రాయి ఎల్లప్పుడు ఆగ్నేయ దిశ వైపు ఉండేలా చూసుకోవాలి. అలాగే మనం కొట్టిన కొబ్బరికాయ సమానంగా పగిలితే ఎంతో శుభసూచికం. అదేవిధంగా మనం పగలకొట్టిన కొబ్బరికాయలో ఏదైనా నల్లగా లేదా కుళ్ళినట్లు కనిపిస్తే వెంటనే శివాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదవడం వల్ల ఆ దోషం అంతటితో వెళ్ళిపోతుంది. ఇలా కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలి.