అడవి శేష్ హీరోగా.. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా “మేజర్” . ముంబై దాడుల్లో మరణించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. తెలుగు, హిందీ, తమిళ్ వంటి పలు భాషలలో ఈ నెల 3 వ తేదీన ఈ సినిమా విడుదలైంది. సినిమా చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా మే 24 నుంచే ఈ సినిమా ప్రీ ప్రీమియర్ షో వేశారు. ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూర్, కొచ్చి, లక్నో, జైపూర్, అహ్మదాబాద్, ముంబయ్, పూణేలో వంటి ప్రముఖ నగరాలలో ప్రీమియర్ షో ని ప్రదర్శించగా.. పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నారు.
జూన్ 3 వ తేదీన విడుదలైన ఈ సినిమ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ గురించి సినిమా యూనిట్ అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయిన రెండు నెలలకి ఓటీటీలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. అంటే ఆగస్ట్ చివరి వారంలో కానీ, సెప్టెంబరు మొదటి వారంలో కానీ ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు.
ఇక ఈ సినిమాలో అడవి శేష్ కి జంటగా సాయి మంజ్రేఖర్ , శోభితా దూళిపాళ్ల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎప్పుడో రిలీజ్ కావలసిన ఈ సినిమా కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. దీంతో సినిమా నిర్మించటానికి ఎవరు ముందుకు రాకపోవడంతో సినిమా షూటింగ్ జరగదేమో అని కంగారు పడినట్టు అడవి శేషు చెప్పుకొచ్చారు. కానీ మహేశ్ బాబు తన సొంత బ్యానర్ జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించాయి.