Bhogi Pallu: భోగిరోజు పిల్లలపై భోగిపళ్ళు ఎప్పుడు పోయాలో తెలుసా?

Bhogi Pallu: హిందువులకు ఎంతో ముఖ్యమైన పండుగలలో సంక్రాంతి పండుగ ఒకటి. ప్రతి ఏడాది జనవరి నెలలో ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.ముఖ్యంగా ఈ పండుగను రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో వేడుకగా జరుపుకుంటారు. భోగితో ప్రారంభమైన ఈ పండుగ నాలుగు రోజులపాటు ఎంతో వేడుకగా జరుపుకునే ముక్కనుమతో ముగిస్తారు. ఈ పండుగను జరుపుకోవడం కోసం ఎక్కడో పట్టణాలలో ఉన్న వారందరూ పల్లెలకు చేరుకుంటారు. ఇలా భోగితో ప్రారంభమైన ఈ పండుగ రోజు ప్రతి ఒక్కరు వారి పిల్లలపై భోగి పళ్ళు వేస్తారు.

చాలామంది భోగి పళ్ళను వారికి ఏ సమయంలో అనుకూలమైతే ఆ సమయంలో పోస్తారు. కానీ భోగి పళ్ళు వేయడానికి కూడా ఒక నియమం ఉంది అనే విషయం చాలా మందికి తెలియదు.ఈ క్రమంలోనే పిల్లలపై భోగి పళ్ళు ఏ సమయంలో వేయాలి అనే విషయాన్ని గురించి ఇక్కడ తెలుసుకుందాం… భోగి రోజు పిల్లలకు సాయంత్రం శుభ్రంగా స్నానం చేసి ఉతికిన దుస్తులను ధరించి వారిని తూర్పుముఖంగా కూర్చోబెట్టాలి.

ముందుగా తల్లి తన బిడ్డకు నుదుటిపై కుంకుమ పెట్టి భోగి పళ్ళు పిడికిలితో తీసుకొని తన బిడ్డ తలపై చేయి పెట్టి మూడుసార్లు కుడి వైపు మూడుసార్లు ఎడమ వైపుకి తిప్పి అనంతరం భోగిపళ్లు పోయాలి. ఇలా భోగి పళ్ళను సూర్యాస్తమయ సమయంలో మాత్రమే పిల్లల తలపై పోయాలని పండితులు చెబుతున్నారు. ముందుగా పిల్లలపై తల్లి భోగి పళ్ళు పోసిన అనంతరం కుటుంబసభ్యులు పోసి చివరికి మంగళ హారతి ఇవ్వాలి.