భార్య, పిల్లలని పరిచయం చేసిన ఆది.. ఆది భార్య ఎవరో తెలుసా..?

ప్రముఖ బుల్లితెర కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెర మీద ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లుగా పాపులర్ అయ్యారు. ఆది కూడా ఈ షో ద్వారానే కమెడియన్ గా బాగా పాపులర్ అయ్యాడు. మొదట అదిరే అభి టీం లో కంటెస్టెంట్ గా తన కెరీర్ ప్రారంభించిన ఆది.. తన ప్రతిభతో అతి తక్కువ కాలంలోనే టీం లీడర్ గా ఎదిగాడు. జబర్దస్త్ స్టేజ్ మీద ఆది వేసే పంచ్ లు, కామెడీ టైమింగ్ ఆది ని స్టార్ కమెడియన్ ని చేశాయి. ఇలా జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన ఆది ఎన్నో టీవీ షో లతో పాటు వరుస సినిమా అవకాశాలు కూడా దక్కించుకున్నాడు.

ప్రస్తుతం ఆది క్యారెక్టర్ ఆర్టిస్టుగా మాత్రమే కాకుండా హీరోగా కూడా ఎన్నో సినిమాలలో నటిస్తున్నాడు. అయితే ఆది గత కొంతకాలంగా జబర్దస్త్ లో కనిపించడం లేదు. కానీ ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో మాత్రం ప్రతివారం సందడి చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నాడు. ఢీ షోలో ప్రదీప్ తో కలిసి ఆది చేసే రచ్చ అంతా కాదు. ఢీ షో లో ఉన్న జడ్జిల మీద కూడా ఆది తన పంచ్ ల వర్షం కురిపిస్తుంటాడు. ఇటీవల వచ్చేవారం ప్రసారం కాబోయే ఢీ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈ ఎపిసోడ్ లో ఆది తన భార్య, పిల్లలని పరిచయం చేశాడు. అయితే ఆది తన భార్యగా పరిచయం చేసిన అమ్మాయి ఎవరో తెలుసా? ఆమె మరెవరో కాదు ఢీ కంటెస్టెంట్ తేజు.

అసలు విషయంలోకి వెళ్తే.. ఈ ఎపిసోడ్ లో ఆది తేజు ని తన భార్యగా పరిచయం చేస్తూ అక్కడున్న చిన్నారులను తన పిల్లలు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే తేజు మాత్రం ఆది కి అంత సీన్ లేదు అంటూ పరువు తీసింది. ఇక ఈ ఎపిసోడ్ లో ఆది తేజు మీద సెటైర్ లు వేసాడు. ఈ క్రమంలో తేజు ఏదో చెప్పటానికి వచ్చి ఆగిపోతుంది. దీంతో ఆది డైలాగ్ పెద్దదా? మరెందుకు వచ్చావ్ అంటూ పరువు తీశాడు. ఇక మరొకసారి వంట అయ్యిందా అని తేజు ని అడిగితే మన కుక్కర్ విజిల్ రాలేదండి అని అంటుంది. అప్పుడు ఆది గణేష్ మాస్టర్ ని అడుగు 5 విజిల్స్ వేస్తాడు అని అంటాడు. మొత్తానికి ఆది ఈ ఎపిసోడ్ లో తేజు తో కలిసి భార్య, భర్త లుగా ఫుల్ ఎంటర్టైన్ చేయనున్నారు.