Ratha Sapathami: రథసప్తమి అంటే సూర్యుడు దినంగా భావించి రథసప్తమి రోజు సూర్యుడికి ప్రత్యేకంగా పూజలను నిర్వహిస్తారు. ప్రతి ఏడాది మాఘమాసం రథసప్తమి రోజున రథసప్తమి పర్వదినం జరుపుకుంటారు. రథసప్తమి రోజు సూర్యభగవానుడికి ఇష్టమైన పూజలను నిర్వహిస్తారు. ఈక్రమంలోనే సూర్యుడికి బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి నీటిని సమర్పించి పూజ చేయటం వల్ల ఆ సూర్యభగవానుడు ఆశీర్వాదాలు ఎల్లవేళలా మనపై ఉంటాయి. సకల జీవకోటి రాశికి ఆధారితమైన రథసప్తమి రోజు జిల్లేడు ఆకులకు ప్రాధాన్యత ఇస్తారు. అయితే రథసప్తమి రోజు జిల్లేడు ఆకులకు ఎందుకంత ప్రాధాన్యత ఇస్తారు అనే విషయానికి వస్తే…
పురాణాల ప్రకారం అగ్నిశ్వాతులు మహా నిష్ఠతో యజ్ఞం చేస్తున్న సమయంలో వారి యజ్ఞానానికి మెచ్చి వారిని స్వర్గానికి తీసుకురమ్మని స్వర్గలోకం నుంచి వారికి దేవ విమానం పంపారు. అదే ఆనందంలో వారు నెయ్యితో కూడిన హోమ ద్రవ్యాలను హోమంలో వేయటం వల్ల పెద్దగా మంటలు వ్యాపించి ఆ మంటలు పక్కనే ఉన్న ఒక మేక పై పడ్డాయి. ఆ వేడికి మేక చర్మం కాలిపోయి వారి కన్నా ముందుగా మేక స్వర్గానికి వెళ్ళింది.
అలా మేక చర్మం పక్కనే ఉన్న చెట్టు పై పడటం వల్ల ఆ చెట్టు జిల్లేడు ఆకలుగా మారిపోయాయి.ఇలా జిల్లేడు చెట్టు ఆ మేక చర్మంపై పడి ఎంతో పవిత్రమైంది. అందుకే రథసప్తమి రోజు జిల్లేడుఆకులను తలపై పెట్టుకొని స్నానం చేయడం వల్ల ఏ విధమైనటు వంటి అనారోగ్య సమస్యలు ఉండవని, సర్వరోగాలు తొలగిపోతాయని భావిస్తారు. అందుకే రథసప్తమి రోజు తలపై జిల్లేడు ఆకులు పెట్టుకుని స్నానం చేయాలని చెబుతారు.