ప్రస్తుత కాలంలో అమ్మాయిలు అబ్బాయిలు వారి ఇష్టానికి అనుగుణంగా వారు జెండర్ మారి వారికి నచ్చిన విధంగా బ్రతకడానికి అలవాటు పడ్డారు. ఈ క్రమంలోనే ఎంతోమంది సర్జరీల ద్వారా ట్రాన్స్ జెండర్ గా మారారు. ఈ క్రమంలోనే ఒక కొడుకు తన తల్లితో తను ట్రాన్స్ మహిళగా మారాలని భావిస్తున్నట్లు చెప్పడంతో దీంతో ఆగ్రహం చెందిన ఆ తల్లి ఏకంగా తన కొడుకు పాలిట మృత్యువు అయిన ఘటన చెన్నైలోని సేలం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
సేలం పోలీస్ స్టేషన్ పరిదిలో ఉమాదేవి అనే మహిళకు 19 సంవత్సరాల నవీన్ అని కొడుకు ఉన్నాడు.నవీన్ ఎల్లప్పుడు తన మహిళగా మారాలని ఉందని తన తల్లి దగ్గర ఎన్నో సార్లు ప్రస్తావించారు. దీంతో నవీన్ ఇలా మాట్లాడిన ప్రతిసారీ తన తల్లి తనని వారించేది.ఇలా ఎన్నో సార్లు తన తల్లి తన కొడుకుగా మాత్రమే ఉండాలని ట్రాన్స్ మహిళగా మారడానికి తనకు ఇష్టం లేదని తన కొడుకు నవీన్ కు హెచ్చరించింది. అయినా నవీన్ తన పంతం వదులుకోవడంతో ఆమె తన కొడుకు పట్ల ఎంతో కఠినంగా ప్రవర్తించింది.
ఈ క్రమంలోనే ఉమా దేవి తన అనుచరులు మరో ఐదు మందితో కలిసి తన కుమారుడు నవీన్ పై దారుణంగా దాడి చేసింది. దీంతో తీవ్ర గాయాలపాలైన నవీన్ ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. కేవలం ట్రాన్స్ మహిళగా మారుతారన్న పాపానికి కన్న కొడుకు అని కూడా చూడకుండా తనపట్ల కాలయముడుగా మారిపోయారు. గత వారం జరిగిన ఈ ఘటనలో భాగంగా సేలం పోలీసులు దర్యాప్తు చేయగా నవీన్ కన్న తల్లి ఈ దారుణానికి ఒడిగట్టిందని గుర్తించిన పోలీసులు ఆమెను ఆమెతోపాటు మరో ఐదుగురిని కస్టడీలోకి తీసుకున్నారు.