ప్రేమించిన అమ్మాయిని పొందటానికి కిర్రాక్ ఆర్పీ ఏం చేశాడో తెలుసా..?

ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో నెంబర్ వన్ స్థానంలో రాణిస్తోంది. ఈ షో ద్వారా పాపులర్ అయిన ఎంతోమంది కమెడియన్లు ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ కమెడియన్లుగా కొనసాగుతున్నారు. ఇలా జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన వారిలో కిర్రాక్ ఆర్పీ కూడా ఒకరు. కమెడియన్ మీద మాత్రమే కాకుండా ఎన్నో సినిమాలలో కూడా నటించాడు. కానీ బుల్లితెర ద్వారా ఆర్పికి దక్కిన గుర్తింపు వెండి తెర మీద లభించలేదు. ఇలా జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన ఆర్పి కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కొంత కాలం క్రితం జబర్దస్త్ నుండి బయటికి వచ్చేశాడు.

ప్రస్తుతం ఆర్పీ మా టీవిలో ప్రసమవుతున్న కామెడీ స్టార్స్ షో లో సందడి చేస్తున్నాడు. ఇదిలా ఉండగా ఇటీవల తను ప్రేమించిన అమ్మాయిని నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ ఫొటోలు చుసి అందరు ఆశ్చర్యపోయారు. కొన్ని రోజులుగా ఆర్పి నిశ్చితార్థం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా మా టీవీ లో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ షో కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదల అయ్యింది. ఈ ప్రోమో లో తనకి కాబోయే భార్యతో కలిసి అందంగా డాన్స్ చేశాడు. ఈ క్రమంలో తన లవ్ స్టోరీ గురించి కూడా చెప్పుకొచ్చాడు. తను ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం ఆర్పీ పడిన కష్టాలు గురించి కూడా చెప్పుకొచ్చాడు.

ఈ క్రమంలో ఆర్పీ ఒక పాటకి డాన్స్ చేస్తూ తన లవ్ స్టోరీ చెప్పేశాడు. మొదట సెల్ఫీ కోసం అమ్మాయి తన దగ్గరికి వస్తే ఫోన్ నంబర్ ఇవ్వమని అడిగాడట. అలా వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది అంటూ చెప్పుకొచ్చాడు. కానీ అమ్మాయి ఇంట్లో మాత్రం వీరి ప్రేమను అంగీకరించలేదట. దీంతో ఆర్పి తను ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవాలని అక్కడున్న అందరి కాళ్ళు పట్టుకున్నాడట. దీంతో ఆర్పి మీద నమ్మకం కుదిరిన అమ్మాయి తల్లితండ్రులు తమ కూతురిని ఆర్పి కి ఇచ్చి వివాహం చేయటానికి అంగీకరించారు. ఇలా పెద్దల అంగీకారం తో బంధు మిత్రుల సమక్షంలో ఆర్పి తను ప్రేమించిన అమ్మాయిని నిశ్చితార్థం చేసుకున్నాడు. త్వరలోనే వీరు పెళ్ళి పీటలు ఎక్కనున్నట్టు సమాచారం.