Devotional Tips: ఇంట్లో పూజకి ఎలాంటి విగ్రహాలు వాడాలో తెలుసా?

Devotional Tips: సాధారణంగా మనం ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇంటిలో దీపారాధన చేస్తూ ఉంటాము. ఈ విధంగా ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం కోసం చాలామంది దేవుడి గదిలోకి వారికి ఎంతో ఇష్టమైన దేవత విగ్రహాలను తీసుకొస్తుంటారు. అలాగే కొందరికి మార్కెట్ లో ఏదైనా అందంగా కనిపించినా కూడా అలాంటి విగ్రహాలను తీసుకువచ్చి పూజలు చేస్తుంటారు.అయితే దేవుని గదిలో పూజ చేయడానికి తీసుకొనే విగ్రహాల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు చెబుతున్నారు.

పూజగదిలో ఎల్లప్పుడూ కూడా తక్కువ పరిమాణంలో ఉన్న విగ్రహాలను మాత్రమే ఉపయోగించాలి.చాలా ఎత్తైన విగ్రహాలు ఉంటే ప్రతి రోజు తప్పనిసరిగా అభిషేకం నైవేద్యం చేయాలి కనుక చిన్న విగ్రహాలను పూజించడం మంచిది. ఇకపోతే స్పటిక విగ్రహాలను పూజించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే ఈ విగ్రహాలు పగలకుండా చూసుకోవాలి.ఇక వినాయకుడి విగ్రహాన్ని పూజించే వారు కేవలం రాగితో తయారు చేసిన వినాయకుడి విగ్రహాన్ని పూజించాలి.

మనం ఇంటికి తెచ్చుకొనే విగ్రహాలు ఎప్పుడూ కూడా భయంకరంగా, ఒకే రూపంలో ఉన్నటువంటి విగ్రహాలను తీసుకోకూడదు. ఇలాంటి విగ్రహాలు ఇంట్లో ఉంటే వెంటనే వాటిని ఏదైనా ఆలయంలో పెట్టి రావడం మంచిది. ఇలాంటి ఉగ్రరూపంలో ఉన్న విగ్రహాలు ఉండటం వల్ల ఇంట్లో ఉన్న సభ్యులు భయాందోళనలకు గురికావడం, మనశ్శాంతి లేకుండా ఉండటం జరుగుతుంది. అందుకే ఎల్లప్పుడు అభయ హస్తంతో ఉన్న విగ్రహాలను తెచ్చుకోవాలి.ఇలా ఇంటిలో పూజకు ఉపయోగించే విగ్రహాల విషయంలో నియమాలు పాటించడం మంచిది.