మనం నిద్ర పోయేటప్పుడు ప్రతి ఒక్కరికి కలలు రావడం సర్వసాధారణం. ఇలా నిద్రించే సమయంలో పగలైనా రాత్రయినా పెద్ద ఎత్తున కలలు వస్తుంటాయి. అయితే కొన్నిసార్లు కలలు మంచి జరిగినట్టు వస్తుంటుంది అలాగే మరి కొన్నిసార్లు కీడును శంకిస్తూ కలలు వస్తుంటాయి. కళలలో ఎంతోమంది దేవుళ్ళు, జంతువులు, మన బంధువులు ఇలా ఎంతోమంది కలలో కనిపిస్తూ ఉంటారు. అయితే కలలో శనీశ్వరుడు కనక కనపడితే చాలామంది ఎంతో కంగారు పడుతూ ఉంటారు. శని దేవుడు కలలో కనిపించడం అశుభానికి సంకేతం అని చాలామంది భావిస్తారు. నిజంగానే శని కలలో కనిపించడం అశుభమా శని కలలో కనిపిస్తే ఏం జరుగుతుందనే విషయానికి వస్తే…
మీ కలలో కనక శని దేవుడు కనిపిస్తూ ఉంటే మీ జీవితంలో ఏదో జరగబోతుందని సంకేతం.ఇలా శని దేవుడు కలలో కనపడితే మన పట్ల శని దయ చూపించడం అలాగే మనపై ఉన్నటువంటి శని దోషం తొలగిపోతుందని అర్థం.శని దేవుడి విగ్రహం లేదా చిత్రపటం కనుక కలలో కనపడితే మనకు ముందు ముందు మంచి రోజులు రాబోతున్నాయని సంకేతం.కానీ మన జాతకంలో శని ఏ స్థానంలో ఉన్నారు అనే విషయాన్ని బట్టి మనకు ఫలితాలు మారుతూ ఉంటాయి.
శని జాతకం సరైన స్థానంలో ఉంటేనే మనకు మంచి జరుగుతుంది లేదంటే కొన్నిసార్లు ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.కొందరికి శని దేవుని విగ్రహం కలలో కనపడితే కష్టాలు కలిగే సూచనలు కూడా ఉంటాయి అలా కాకుండా శని దేవుడు నేరుగా కనిపించినట్లు అయితే అలాంటి వారిపై శని ప్రభావ దోషం తొలగిపోయి వారికి అన్ని శుభ పరిణామాలే కలుగుతాయని అర్థం. ఇక శని దేవాలయం కలలో కనిపించడం వల్ల వారికి త్వరలోనే ధన లాభం ఉంటుందని సంకేతం.