సినిమా లాంచింగ్ చంద్రబాబుతో చేయించానని, ఆయన్ని కలిసినప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని, ఆల్ ది బెస్ట్ కూడా చెప్పారని ప్రముఖ దర్శకుడు సాయి వెంకట్ అన్నారు. టిడిపి ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు వైజాగ్ ఫిలిం కల్చరల్ సెంటర్ స్థలం ఇచ్చారు.వైజాగ్ లో ఫిలిం కల్చర్స్ సెంటర్ ఉండటం వల్ల సినీ పరిశ్రమ కు ఏదైనా ఉపయోగం ఉందా అన్న ప్రశ్న ఎదురవడంతో డైరెక్టర్ సాయి ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.తనకు తెలిసి స్థలం ఇచ్చారని తనైతే అనుకోవడం లేదని ఆయన చెప్పారు. అది ఏదో రెంటుకు లీస్ లో ఉంది అనుకుంటానని ఆయన చెప్పారు. అంతకుముందు ఫ్రీ అన్నారట, కానీ ఇప్పుడు చార్జ్ అంటున్నారట, దానిపై క్లారిటీ లేదని, 100% నాలెడ్జ్ లేదని ఆయన తెలిపారు. కానీ ఆయన దాంట్లో ఓ ప్రొడ్యూసర్ ద్వారా తాను అందులో మెంబర్షిప్ కూడా తీసుకున్నానని ఆయన స్పష్టం చేశారు.
తాను వెళ్లి క్లబ్ కూడా చూశానని, చాలా బాగుందని కూడా సాయి వెంకట్ చెప్పారు. నిజంగా ఏపీ ప్రభుత్వం తలచుకుని అక్కడ ఏదైనా చేస్తే, చాలా బాగుంటుందని ఆయన తెలిపారు. లొకేషన్స్ బాగున్నాయి కాబట్టి షూటింగ్స్ కూడా ఎన్నో అయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు. స్పాట్ లాగా కూడా చేయొచ్చు అని, జమ్మూ కాశ్మీర్ లాంటి ప్లేస్ కి వెళ్లి షూటింగ్ ఎలా తీస్తారో అలా ఇక్కడ కూడా ఎన్నో క్రియేషన్స్ అమేజింగ్ పార్కులు గాని క్రియేషన్స్ చేయొచ్చు అని, ఎంతో సోర్స్ ఉందని ఆయన అన్నారు. కానీ ప్రభుత్వం కొన్ని వందల కోట్లు కేటాయిస్తే, సినీ పరిశ్రమ వైజాగ్ లో నిలిచి పోతుందని ఆయన స్పష్టం చేశారు. నిజం చెప్పాలంటే తెలంగాణలో చాలా లొకేషన్స్ ఉన్నాయని వాళ్లు వాటిని చాలా బాగా ఉపయోగించుకుంటున్నారని సాయి వెంకట్ అన్నారు కానీ అక్కడి తో పోలిస్తే ఏపీలో అంతకంటే ఎక్కువ లొకేషన్స్ ఉన్నాయని ఆయన వివరణ ఇచ్చారు ఎందుకంటే తను చాలా సినిమాలు వైజాగ్, విజయవాడ నెల్లూరు తిరుపతిలోనూ చేశానని, చాలా జిల్లాలలో చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయని ఆయన చెప్పారు.