మంజుల, నిరుపమ్ ఇండస్ట్రీలోకి రాకపోయి ఉంటే ఇప్పుడూ ఏం చేసేవారో తెలుసా…?

బుల్లితెర నటుడు నిరుపమ్ పరిటాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబు పాత్రలో నటించి డాక్టర్ బాబుగా బాగా పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ లో నిరుపమ్ పాత్ర ముగియటంతో ప్రేక్షకులు బాగా మిస్ అవుతున్నారు. అయితే నిరుపమ్ తన భార్యా మంజులతో కలిసి సోషియల్ మీడియాలో సందడి చేస్తున్నాడు. నిరుపమ్ భార్య మంజుల కూడా ఒక బుల్లితెర నటి. వీరిద్దరూ కలిసి ఎన్నో సీరియల్స్ లో నటించారు. వీరిద్దరూ కలిసి నటించిన చంద్రముఖి సీరియల్ బాగా పాపులర్ అయింది. వీరిద్దరూ కలిసి ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ ద్వారా తన అభిమానులకు దగ్గరౌతున్నారు.

ఇదిలా ఉండగా యూట్యూబ్ చానల్లో వీరిద్దరూ తమ లైఫ్ కి సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటూ ప్రతిరోజు వారి జీవితం లో జరిగే సంఘటన గురించి వీడియో తీస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల వీరిద్దరు అభిమానుల ప్రశ్నలకి సమాధానాలు చెబుతూ ఒక వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో మంజుల నిరుపమ్ అభిమానులు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పారు. ఈ క్రమంలో ఎంతో మంది అభిమానులు తమ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాల గురించి కూడా అడిగారు. ఈ క్రమంలో ఒక నెటిజన్ అడిగిన ప్రశ్న చాలా ఆసక్తికరంగా ఉంది.

మీ ఇద్దరూ బుల్లితెర నటులు కాకపోయి ఉంటే జీవితంలో ఏం అయ్యేవారు? అని ఒక నెటిజన్ ప్రశ్నించారు. దీనికి నిరుపమ్ సమధానం చెప్తూ ఎలాగో బీటెక్ చదువుకున్నాను. ఎవరో ఒకరిని పట్టుకొని బ్యాక్ డోర్‌లో జాబ్ సంపాదించుకునే వాడిని. లేదంటే.. మైత్రివనం, అమీర్ పేట్‌లో ఏదో ఒక కోర్సు నేర్చుకుని జాబ్ చేసేవాడిని అంటూ నిరుపమ్ చెప్పుకొచ్చాడు. కానీ తనకు ఎప్పుడూ కూడా ఉద్యోగం చేయాలి అన్న ఆలోచన రాలేదని ఈ సందర్భంగా తెలియచేశాడు. ఇక మంజుల విషయానికి వస్తే తను నటి కాకపోయి ఉంటే చార్టెడ్ అకౌంటెట్ అవ్వాలని అనుకుందట . కానీ నటనవైపు రావటంతో ఇందులోనే ఫిక్స్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చింది.