గెటప్ శ్రీను జబర్ధస్త్ మనేయటానికి కారణం ఏంటో తెలుసా? షాకింగ్ విషయాలు బయటపెట్టిన అవినాష్…!

ప్రస్తుతం ఇండస్ట్రీలో కమెడియన్ల గా గుర్తింపు పొందిన వారిలో చాలామంది జబర్దస్త్ నుండి వచ్చినవారే. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో గత తొమ్మిది సంవత్సరాలుగా కామెడీ తో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు గా ఇండస్ట్రీకి పరిచమయ్యారు. అటువంటి వారిలో సుధీర్, గెటప్ శ్రీను, రాంప్రసాద్, ఆది, అవినాష్ వంటి చాలా మంది ఉన్నారు. అయితే ప్రస్తుతం పాపులర్ కమెడియన్లు అందరూ జబర్దస్త్ నుండి వెళ్ళిపోతున్నారు. నాగబాబు జబర్దస్త్ నుండి వెళ్లిపోవడంతో చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పి వంటివారు ఆయనతో పాటుగా వెళ్ళారు.

ఇటీవల రోజా మంత్రి పదవి దక్కడం తో జబర్దస్త్ మానేసింది. అప్పటినుండి అదిరే అభి గెటప్ శీను సుడిగాలి సుదీర్ హైపర్ ఆది వంటి ఫేమస్ కమెడియన్లు జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయారు . ఇలా ఎలా చే మస్త మీడియం లు జబర్దస్త్ నుండి వెళ్లిపోవడంతో జబర్దస్త్ రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి. ఇంకా కొన్ని రోజులు ఇలాగే కొనసాగితే జబర్దస్త్ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. ఇదిలా ఉండగా జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన ముక్కు అవినాష్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. తాను జబర్దస్త్ నుండి బయటకు రావటానికి గల కారణాల గురించి చెప్పుకొచ్చాడు.

బిగ్ బాస్ లో పాల్గొన్న తర్వాత అవినాష్ కి జబర్దస్త్ లో కామెడీ చేసే అవకాశం ఇవ్వలేదు. అలాగే అవినాష్ ప్రస్తుతం మా టీవీలో ప్రసారమవుతున్న కామెడీ షో లో సందడి చేస్తున్నాడు . ఇదిలా ఉండగా గెటప్ శీను చాలా కాలం నుండి జబర్దస్త్ లో కనిపించడం లేదు. అందుకు గల కారణం ఏంటి అని యాంకర్ అడిగింది. దీనికి అవినాష్ స్పందిస్తూ ప్రస్తుతం గెటప్ శీను వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే కాకుండా హీరోగా కూడా పలు సినిమాలలో నటిస్తున్నాడు. ఒక వైపు సినిమాలు మరో వైపు జబర్దస్త్ చేయటానికి డేట్స్ కుదరటం లేదు. అంతే కాకుండా ఒకస్కిట్ కోసం జబర్ధస్త్ లో ఇచ్చే రెమ్యూనరేషన్ కంటే సినిమాల నుండీ ఎక్కువ ఆదాయం రావటం కూడ ఒక కారణం అంటూ చెప్పుకొచ్చాడు.