75వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ఫ్యాన్స్ లో ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 17న ప్రారంభమైన ఈ చలన చిత్ర వారోత్సవాలు ఈ నెల 28వ తేదీ వరకు ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పటికే మన సౌత్ ఇండస్ట్రీ, బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఎంతో మంది సెలబ్రిటీలు ఈ చలన చిత్ర వారోత్సవాలలో పాల్గొని పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే రెడ్ కార్పెట్ పై నడిచి అందరినీ సందడి చేశారు. ఇకపోతే రెడ్ కార్పెట్ పై నడవడం కోసం ఈమె దుస్తుల నుంచి మొదలుకొని నగలు, మొదలైన వాటిని ప్రత్యేకంగా డిజైన్ చేయించు కున్నారు.
ఈ క్రమంలోనే దీపిక ధరించిన నెక్లెస్ గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో భాగంగా దీపిక ధరించిన డైమండ్ నెక్లెస్ చూడటానికి ఎంతో విభిన్నంగా ఉండటంతో అందరి దృష్టి దాని పైన పడింది. ఈ క్రమంలోనే ఈ నక్లెస్ ధర ఎంత అని పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నారు. బ్లాక్ కలర్ డ్రెస్ ధరించి ఈ నెక్లెస్ వేసుకోవడంతో దీపిక అందం మరింత రెట్టింపు అయిందని చెప్పాలి. ఇకపోతే ఈమె ధరించిన ఈ నక్లెస్ ధర తెలుసుకొని ప్రతి ఒక్కరు ఎంతో షాక్ అవుతున్నారు.
ఈ నెక్లెస్ ముందుభాగంలో పులులు వచ్చేలా ఎంతో అద్భుతంగా డిజైన్ చేశారు. ఇకపోతే ఈ పులి కంటికి ఖరీదైన పచ్చలను పొదిగించి ఉన్నారు. ఈ నెక్లెస్ నా ఫ్రాన్స్ కి చెందిన ప్రముఖ నగల తయారీ సంస్థ కార్టియర్ తయారు చేసిందట. పూర్తిగా 18 క్యారెట్ల తెల్ల బంగారంతో తయారు చేసిన ఈ నెక్లెస్ రేటు సుమారుగా రూ.3 కోట్ల 80లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. ఇలా ఈమె ధరించిన ఈ నెక్లెస్ విలువ దాదాపు నాలుగు కోట్ల అని తెలియడంతో ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు ఎంతో ఆశ్చర్యపోతున్నారు.