రష్మిక చేతి పై ఉన్న టాటూకి అర్థం ఏంటో తెలుసా?

నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలు ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా పాన్ ఇండియా ప్రాజెక్టులతో పాటు పలు బాలీవుడ్ సినిమాలు తెలుగు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీ బిజీగా గడుపుతోంది. ఇకపోతే ఈమె నటించిన గుడ్ బై బాలీవుడ్ చిత్రం అక్టోబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ రష్మిక ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా పలు ప్రాంతాలలో ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్నటువంటి ఈమె తనకు సంబంధించిన ఎన్నో విషయాలను వెల్లడిస్తున్నారు. ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి రష్మిక చేతిపై ఉన్నటువంటి టాటూను గుర్తించిన నేటిజన్స్ ఆమె చేతికి ఉన్న టాటూ అర్థం ఏంటి అని ఆరా తీస్తున్నారు.అయితే రష్మిక చేతి పై ఉన్న టాటూ ఏంటి దానికి అర్థం ఏంటి అనే విషయానికి వస్తే..

రష్మిక తన కుడి చేతిపై ఇర్రీప్లేసబుల్ అనే టాటూ వేయించుకున్నారు. ఇక ఈ ఈ టాటూకు అర్థం జీవితంలో మిమ్మల్ని ఎవరు భర్తీ చేయలేరు అని అర్థం వస్తుంది. తన చేతిపై ఎంతో స్టైలిష్ గా కనిపించే ఈ టాటూ ఎన్నోసార్లు మీడియా కంటపడినప్పటికీ ఈ టాటూ కి సరైన అర్థం ఎప్పుడు చెప్పలేదు అయితే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తన చేతిపై ఉన్నటువంటి టాటూ అర్థం తెలియజేశారు. ఇకపోతే రష్మిక గుడ్ బై సినిమా విడుదలైన అనంతరం పుష్ప 2 సినిమా షూటింగులో పాల్గొనబోతున్నారు.