అందరినీ నవ్వించే పైమా నవ్వు వెనక ఉన్న కన్నీటి కష్టాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిన విషయమే. గత తొమ్మిది సంవత్సరాలుగా ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రసారం అవుతున్న ఈ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ కామెడీ షో ఎంతో మంది ఆర్టిస్టులకు జీవితాలను ఇచ్చింది. జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు పేదరికం నుండి బయటపడి నలుగురికి సహాయం చేసే స్థాయికి ఎదిగారని చెప్పటంలో సందేహం లేదు. ఒకప్పుడు లేడీ గెటప్ తో ప్రేక్షకులను అలరించేవారు. కానీ ప్రస్తుతం జబర్దస్త్ లో లేడీ కంటెస్టెంట్ లు తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

అలా జబర్దస్త్ లో లేడీ కమెడియన్ గా ఫైమా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మొదట ఈటీవీ ప్లస్ లో ప్రసారమైన పటాస్ షో లో సందడి చేసిన తర్వాత జబర్దస్త్ లో తన కామెడీతో రచ్చ చేస్తోంది. జబర్దస్త్ లో అవకాశం రాక ముందు పై మా కుటుంబం ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కానీ బుల్లెట్ భాస్కర్
పైమాని తన టీమ్ లో కంటెస్టెంట్ గా చేర్చుకొని ఆమెకి మంచి జీవితాన్ని ఇచ్చాడు. జబర్దస్త్ ద్వారా లేడీ కమెడియన్ గా పాపులర్ అయిన ఇటీవల ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూ లో తన పర్సనల్ విషయాల గురించి కూడా చెప్పుకొచ్చింది.

ఫైమా ఇంటర్వ్యు లో మాట్లాడుతూ.. జబర్దస్త్ కి రాకముందు నా కుటుంబం ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఐదు పది రూపాయలు కావాలంటే మా అమ్మ బీడీలు చుట్టి వాటిని అమ్మి ఇచ్చేది. మాది ఒక చిన్న ఇల్లు. మా ఇంట్లో కనీసం టీవి, ఫ్రిజ్ వంటివి కూడ లేవు. కానీ నేను జబర్ధస్త్ కి వచ్చిన తరువాత నా రాత మారిపోయింది. ఇప్పుడు బయట నాకు మంచి గుర్తింపు లభించడమే కాకుండా ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోయాయి. నాది సెల్ఫీ తీసుకునే మొఖం కాకపోయినప్పటికీ అందరూ ఇప్పుడు నాతో సెల్ఫీలు దిగుతున్నారు. దీనంతటికీ కారణం బుల్లెట్ భాస్కర్ అన్న. ఆయన వల్లే ఇప్పుడు నేను ఈ పొజిషన్ లో ఉన్నాను. భాస్కర్ అన్న ప్రాక్టీస్ చేసే సమయంలో నాకు బాగా సపోర్ట్ చేసేవాడు. అందువల్లే నేను స్టేజ్ మీద అంత బాగా పెర్ఫామ్ చేసేదాన్ని. ఇళ్లు కట్టుకోవాలి అన్న మా అమ్మ కలని నెరవేర్చాలి.