Rajanikanth: ఆమ్మో.. రజినీకాంత్ ఆస్తుల విలువ అన్నీ కొట్లా.. భారీగా సంపాదించాడుగా!

Rajanikanth: టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇతను తన నటనతో, స్టైల్ తో కోట్లాది మంది ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకున్నారు.కండక్టర్ నుంచి సూపర్ స్టార్ గా ఎదిగిన వ్యక్తి రజనీకాంత్. రజనీకాంత్ కెరీర్ మొదలు నుంచి ఇప్పటి వరకు అతను సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అలాంటి తలైవా డిసెంబర్ 12న తన పుట్టిన రోజున జరుపుకున్నారు. మరి రజనీకాంత్ గురించి మరిన్ని ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

రజినీకాంత్ ప్రస్తుతం తన 70 ఏళ్ళ వయసులో కూడా యువ హీరోలకు పోటీగా నిలుస్తూ సినిమాలో నటిస్తున్నారు. తలైవా సినిమాల ద్వారా ద్వారా బాగానే సంపాదించాడు. తమిళ సినీ పరిశ్రమలో అత్యధికంగా సంపాదిస్తున్న తారల జాబితాలో రజినీకాంత్ ముందు వరుసలో ఉంటాడు. అంతేకాకుండా తమిళ సినీ పరిశ్రమలో ప్రస్తుతం అగ్ర హీరోలలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరో కూడా రజనీకాంతే. ఇకపోతే ప్రస్తుతం సోషల్ మీడియాలో రజనీకాంత్ ఆస్తిపాస్తుల గురించి హాట్ టాపిక్ గా మారింది.

కక్న లెడ్జ్ ప్రకారం రజనీకాంత్ నికర ఆస్తుల విలువ దాదాపు 360 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఆస్తి అంతా కూడా రజనీకాంత్ కేవలం సినిమాల ద్వారానే సంపాదించారు. కేవలం సినిమాల ద్వారానే ఇంత సంపాదిస్తే.. మరి యాడ్స్ ద్వారా ఇంకెంత సంపాదించేవారని అంటున్నారు. రజనీకాంత్ ఒక సినిమాకు 60 కోట్ల పారితోషికాన్ని అనుకుంటున్నాడని సమాచారం. రజిని 1950 డిసెంబర్ 12న జన్మించాడు. కేవలం తెలుగు సినిమాలలో మాత్రమే కాకుండా తమిళం,కన్నడ చిత్రాలలో కూడా నటించారు. మొదట అపూర్వ రాగంగల్ అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చారు.