Prabhas: ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాతో రికార్డులు కొల్లగొట్టిన హీరో… అలా ఎలా వదిలేసావన్నా?

Prabhas: సాధారణంగా కొన్ని సినిమాలు కొంతమంది హీరోల వద్దకు వెళ్లిన కొన్ని కారణాల వల్ల ఆ సినిమాలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఇలా రిజెక్ట్ చేసిన సినిమాలు ఇతర హీరోలు చేయడం బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకోవడం లేదా డిజాస్టర్స్ అందుకోవడం జరుగుతుంది. ఈ క్రమంలోనే ప్రభాస్ రిజెక్ట్ చేసిన ఓ సినిమాతో యంగ్ హీరో సంచలనమైన రికార్డులు సాధించారని తెలుస్తుంది. ఏకంగా తొమ్మిది భాషల ఆ సినిమా విడుదలై సంచలనమైన రికార్డులను సృష్టించింది. మరి ప్రభాస్ వదులుకున్న అలాంటి సూపర్ హిట్ సినిమా ఏంటి? ఆ సినిమా చేసి రికార్డులు సాధించిన ఆ హీరో ఎవరు అనే విషయానికి వస్తే..

ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా దర్శకుడుగా, సిద్దార్థ్ త్రిష హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం నువ్వు వస్తానంటే నేనొద్దంటానా. ఈ సినిమాలో ముందుగా నటించే అవకాశం ప్రభాస్ వద్దకు వెళ్ళింది. ఆ సమయంలో ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా చేయడం కుదరలేదు దీంతో ప్రభుదేవా సిద్దార్థ్ ను సంప్రదించడంతో సిద్ధార్థ ఈ సినిమాలో నటించారు.

నువ్వొస్తానంటే నేనొద్దంటానా అప్పట్లో సంచలనం సృష్టించింది. అంతేకాకుండా ఈ మూవీ ఏకంగా 9 భాషలలో రీమేక్ అయ్యింది. ఈ మూవీతో తెలుగు చరిత్రలోనే రికార్డ్స్ బద్దలుకొట్టాడు. కేవలం కలెక్షన్స్ లో మాత్రమే కాదు.. అవార్డులలో సైతం ఈ సెన్సేషన్. అప్పట్లో ఈ మూవీ ఏకంగా 9 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ గెలుచుకుంది. అలాగే ఈ సినిమాకు 5 నంది అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఇలాంటి ఒక సూపర్ హిట్ సినిమాని ప్రభాస్ మిస్ చేసుకున్నారని తెలిసిన అభిమానులు అలా ఎలా వదులుకున్నావు అన్న అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.