Kiran Abvavaram: టాలీవుడ్ సినీ నటుడు కిరణ్ అబ్బవరం గత ఏడాది ఆగస్టులో ఎంతో ఘనంగా వివాహం జరుపుకున్నారు. అయితే ఈ ఏడాది ఈ జంట పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇలా వీరికి బాబు జన్మించి కూడా దాదాపు రెండు మూడు నెలలు అవుతుంది అయితే ఇప్పటివరకు రహస్య కిరణ్ అబ్బవరం ఎక్కడా కూడా తమ కొడుకు ఫేస్ రివిల్ చేయలేదు. తన కొడుకుతో కలిసి దిగిన ఫోటోలను కిరణ్ అబ్బవరం షేర్ చేస్తూ ఉన్నప్పటికీ ఎక్కడ ఫేస్ కనపడకుండా జాగ్రత్తలు పడేవారు. అయితే తాజాగా తన కొడుకును అందరికీ పరిచయం చేశారు.
నేడు కిరణ్ అబ్బవరం దంపతులు తమ కుమారుడికి నామకరణ వేడుకను నిర్వహించారు. అయితే ఈ వేడుకను తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నిర్వహించారని తెలుస్తోంది. ఇలా ఈ దంపతులు ఎంతో సాంప్రదాయబద్ధంగా ఆలయ ఆవరణంలో కనిపించారు అలాగే తమ కొడుకు పేరును కూడా కిరణ్ అబ్బవరం రివిల్ చేయడమే కాకుండా సోషల్ మీడియా వేదికగా తన కొడుకుతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేయడంతో ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కిరణ్ అబ్బవరం రహస్య దంపతులు తమ కుమారుడికి హనుఅబ్బవరం అనే పేరును పెట్టినట్లు వెల్లడించారు. అలాగే తన కొడుకు ఫోటోలను కూడా షేర్ చేశారు ఈ చిన్నారి ఎంతో చూడు ముచ్చటగా ముద్దుగా ఉన్నారని చెప్పాలి. సాంప్రదాయమైన దుస్తులలో, నుదిటిన గోవింద నామాలతో హనుఅబ్బవరం చాలా ముద్దుగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిన్నారికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక కిరణ్ అబ్బవరం కెరియర్ విషయానికి వస్తే వరుస సినిమాలలో నటిస్తూ ఈయన బిజీగా ఉన్నారు . ప్రస్తుతం . కే ర్యాంప్, చెన్నై లవ్ స్టోరీ ల షూటింగ్ జరుగుతోందన్నాడు. ఈ నెలలో మరో కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం తన సినిమాల గురించి కూడా వెల్లడించారు.
