సర్కారీ వారి పాట కోసం డైరెక్టర్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలుసా?

మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సర్కారీ వారి పాట. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఈ నెల 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి షో తో మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకొన్నప్పటికీ కొందరు ఉద్దేశపూర్వకంగా ఈ సినిమా పై దుష్ప్రచారం చేశారంటూ పెద్దఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి.ఈ విధంగా ఈ సినిమా గురించి నెగిటివ్ ప్రచారం చేసినప్పటికీ అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరిందని తెలుస్తోంది.

ఇకపోతే ఈ సినిమా కోసం డైరెక్టర్ పరుశురామ్ రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిఖిల్ నటించిన యువత సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమైన పరుశురాం అనంతరం సోలో, శ్రీరస్తు శుభమస్తు వంటి పలు సినిమాలకు దర్శకత్వం వహించినా ఆయనకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ క్రమంలోనే పరశురామ్ విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన గీతా గోవిందం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈయన తన తదుపరి ప్రాజెక్టు మహేష్ బాబుతో చేశారు.

ఇలా మహేష్ బాబుతో చేస్తున్న సినిమా అంటే భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఉంటుందని అంచనా వేయవచ్చు. గీతా గోవిందం వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత పరశురామ్ దర్శకత్వం వహించిన సినిమా సర్కారు వారి పాట కావడంతో ఈ సినిమాకు డైరెక్టర్ పరుశురామ్ ఏకంగా పది కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. ఇక ఈ విషయం తెలిసి ఎంతోమంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.అయితే గీతా గోవిందం వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఈయన ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకోవడం ఏమాత్రం తప్పుకాదని పలువురు వారి అభిప్రాయాలను తెలియ చేస్తున్నారు.