తెలుగు సినిమా ఇండస్ట్రీలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అప్పట్లో ఎన్టీఆర్ సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాష్ట్ర రాజకీయాలలో ఎంతో చురుగ్గా పాల్గొని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. ఈ విధంగా ఎన్టీఆర్ రాజకీయాల్లోనూ సినిమాల్లోనూ నెంబర్ వన్ స్థానంలో కొనసాగారు. ఎన్టీఆర్ కు 11 మంది సంతానం అనే విషయం మనకు తెలిసిందే. వీరిలో బాలకృష్ణ ఎన్టీఆర్ వారసత్వాన్ని అందిపుచ్చుకుని ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.
ఈ విధంగా బాలకృష్ణ పెళ్లి సమయానికి ఎన్టీఆర్ రాష్ట్ర రాజకీయాలలో ఎంతో బిజీ అయ్యారు. అయితే ఎన్టీఆర్ భార్య బసవతారకం బాలకృష్ణకు పెళ్లి చేయాలని ఎంతో ఒత్తిడి తీసుకువచ్చారు.ఆ సమయంలో బాలకృష్ణకి పెళ్లి చూపులు చూసే సమయం కూడా ఎన్టీఆర్ కి లేకపోవడంతో ఆయన నాదెండ్ల భాస్కర్ రావుకు ఆ బాధ్యతను అప్పగించారు. ఈ క్రమంలోనే నాదెండ్ల భాస్కర్ రావు ఒక పెళ్లిలో దేవరపల్లి సూర్యరావు కుటుంబాన్ని ఆయన కూతుర్ని చూశారు.బాలకృష్ణకు సరైన జోడి ఆయన కూతురు వసుంధర అని భావించిన నాదెండ్ల భాస్కర్ ఈ విషయాన్ని దేవరపల్లి సూర్యరావు కి తెలియజేశారు.
సాక్షాత్తు ఎన్టీఆర్ తో వియ్యం అందుకోవడం అంటే దేవరపల్లి సూర్యరావు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఆయన శ్రీ రామదాసు మోటార్ ట్రాన్స్ పోర్ట్ అధినేత. ఈ విధంగా నాదెండ్ల భాస్కర్ రావు ఎన్టీఆర్, దేవరపల్లి సూర్యరావు కుటుంబాలను కలిపి వీరి వివాహాన్ని ఎంతో ఘనంగా చేశారు. ఇక వీరి వివాహ సమయంలో దేవరపల్లి సూర్య రావు బాలకృష్ణకు కట్నం కింద 10 లక్షల రూపాయలను ఇచ్చారు. అయితే బాలకృష్ణ ఆ డబ్బుతో వసుంధర పేరు పై హైదరాబాద్లో ఇంటి నిర్మించారు.ఇలా బాలకృష్ణ అప్పట్లోనే పది లక్షల రూపాయలను కట్నకానుకలుగా తీసుకున్నారు.